
గతంలో పుష్ప ప్రమోషన్స్‌లోనూ అల్లు అర్జున్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మాకు చెప్పిన టైం ఒకటైతే మీరు వచ్చిన టైం ఇంకోటి అంటూ కన్నడ పాత్రికేయులు బన్నీని నిలదీశారు.
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈ నెల 14న రిలీజవుతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్. అయితే అనుకున్న సమయాని కంటే ఆలస్యంగా ప్రెస్‌మీట్ మొదలుపెట్టడంతో రిపోర్టర్లు యశ్‌ను నిలదీశారు. మమ్మల్ని 11 గంటలకల్లా ఇక్కడ ఉండాలన్నారు. మేము వచ్చి గంటన్నరపైనే అవుతోంది. కానీ మీరిప్పుడు ఇంత లేటుగా వచ్చారు అంటూ ఓ రిపోర్టర్ అసహనం వ్యక్తం చేశాడు.
దీనికి యశ్ స్పందిస్తూ.. 'నాకు ఐడియానే లేదు సర్, నన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నాను. ప్రైవేట్ జెట్స్ టేకాఫ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని కారణంగా ఆలస్యమైనందుకు క్షమించండి. ఇండస్ట్రీని మీరు చాలాకాలంగా చూస్తున్నారు. మేము కావాలనైతే చేయలేదు. నాకు సమయం విలువ బాగా తెలుసు' అంటూ మీడియాకు సారీ చెప్పాడు.
కాగా గతంలో పుష్ప ప్రమోషన్స్‌లోనూ అల్లు అర్జున్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. మాకు చెప్పిన టైం ఒకటైతే మీరు వచ్చిన టైం ఇంకోటి అంటూ కన్నడ పాత్రికేయులు బన్నీని నిలదీశారు. దానికతడు చార్టెడ్ ఫ్లైట్ టేకాఫ్ ప్రాబ్లమ్ అవడంతోనే లేట్ అయిందని కారణం చెప్తూనే అందరికీ సారీ చెప్పాడు. సారీ చెప్పడం వల్ల మనిషి ఎదుగుతాడు కానీ తగ్గడు అని పేర్కొన్నాడు. అయితే అప్పట్లో బన్నీని అలా క్వశ్చన్ చేసినందుకు ప్రతీకారంగా తెలుగు మీడియా యశ్‌ను నిలదీసిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
Looks like revenge😂 pic.twitter.com/ZgrzlrK1lZ
— AK. (@flawsomedamsel) April 11, 2022