ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..? | Sakshi
Sakshi News home page

ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో..?

Published Thu, May 23 2024 6:18 AM

Keerthy Suresh As MS Subbulakshmi

ప్రముఖ గాయని ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర పరిశ్రమ వర్గాలు. మహానటి సావిత్రి బయోపిక్‌గా రూ΄÷ందిన ‘మహానటి’ (2018)లో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు కీర్తీ సురేష్‌. ఈ చిత్రానికిగాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారామె. ఆ తర్వాత రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా లతో పాటు లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు చేస్తున్న కీర్తి తాజాగా ఎంఎస్‌ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో నటించనున్నారని భోగట్టా. 

ఈ సినిమా దర్శకుడు, నిర్మాణ సంస్థ వంటి వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాత్రని కీర్తీ సురేష్‌ ΄ోషించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌ టాక్‌. తమిళనాడులోని మధురైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సుబ్బలక్ష్మి ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎలా ఎదిగారు? ఆమె ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆనందం, విషాద ఘటనల నేపథ్యంలో ఈ బయోపిక్‌ తెరకెక్కనుందట. ఈ పాత్రకి కీర్తీ సురేష్‌ సరైన ఎంపిక అని చిత్ర యూనిట్‌ ఆమెను సంప్రదించగా, ఆమె పచ్చజెండా ఊపారని టాక్‌.  కాగా ఎంఎస్‌ సుబ్బలక్ష్మి 2004 డిసెంబరు 11న తుది శ్వాస విడిచారు.

Advertisement
 
Advertisement
 
Advertisement