విరాట్ కోహ్లీ మా పొరుగింటి వ్యక్తే: స్టార్ హీరోయిన్ | Sakshi
Sakshi News home page

Katrina Kaif: అతనొక సూపర్ స్టార్.. ఆదర్శం.. కింగ్‌ కోహ్లీపై ప్రశంసలు!

Published Sun, Nov 19 2023 9:42 AM

Katrina Kaif Praises Virat Kohli Ahead Of IND vs AUS CWC Final 2023 - Sakshi

బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఇటీవలే టైగర్-3 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. టైగర్ సిరీస్‌లో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన మెరిసింది. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మరోవైపు కోలీవుడ్‌లో విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్‌మస్‌ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. అయితే ప్రస్తుతం అందరిదృష్టి వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌పైనే ఉంది. ఈ నేపథ్యంలో కత్రినా కైఫ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: ఇలాంటి నీచమైన వ్యక్తితో ఇకపై నటించను: త్రిష)

ఫైనల్ మ్యాచ్‌కు ముందు కింగ్ కోహ్లీ విరాట్‌పై ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. తన ఇన్‌స్టాలో 'ఆస్క్‌ మీ ఏ క్వశ్చన్‌' అనే సెషన్ నిర్వహించింది. ఇందులో విరాట్ కోహ్లీ గురించి చెప్పండి? అని ప్రశ్నించారు. దీనికి కత్రినా బదులిస్తూ.. 'సూపర్ స్టార్, ఆదర్శవంతుడు, అంతే కాకుండా మా పొరుగు వ్యక్తి' అంటూ విరాట్ ఫోటోను పోస్ట్ చేసింది. అంతే కాకుండా టైగర్‌ సినిమా గురించి నెటిజన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. 

ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ కప్ ఫైనల్ కోసం తాను ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు కత్రినా తెలిపారు. ఈ వరల్డ్‌ కప్‌లో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీని కత్రినా ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు.. ఆమె పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీని ప్రశంసించారు. కాగా.. అనుష్క శర్మ, కోహ్లి చాలా ఏళ్లుగా ముంబయిలోని  ఓ  గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్నారు. కత్రినా తన  వివాహానంతరం భర్త విక్కీ కౌశల్‌తో కలిసి అదే భవనంలో ఉంటోంది. 

(ఇది చదవండి: త్రిషపై సంచలన కామెంట్స్.. లియో నటుడిపై సినీతారల ఆగ్రహం!)

Advertisement
 
Advertisement
 
Advertisement