త్రిష నలుపు దుస్తులు ధరిస్తే హిట్‌ పక్కా..ఇదిగో సాక్ష్యం! | Karuppu Movie: Black Dress Is Sentiment For Trisha's Victory | Sakshi
Sakshi News home page

త్రిష నలుపు దుస్తులు ధరిస్తే హిట్‌ పక్కా..ఇదిగో సాక్ష్యం!

May 27 2026 8:51 AM | Updated on May 27 2026 9:06 AM

Karuppu Movie: Black Dress Is Sentiment For Trisha's Victory

గత కొద్ది కాలంగా చర్చనీయాంశంగా మారిన నటి త్రిష. ఒక పక్క ఈ బ్యూటీ తమిళంలో అజిత్‌ కు జంటగా నటించిన విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థక్‌ లైఫ్‌ చిత్రాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ అపజయం పాలవడం, ఆ తరువాత నటుడు ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి ట్రోలింగ్‌లకు గురవడం వంటి విషయాలతో చాలా తలనొప్పికి గురైన త్రిష, ఎప్పుడైతే విజయ్‌ ఎన్నికల్లో గెలవడంతో పాటు పార్టీని ఒంటి చేతితో గెలిపించుకుని ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి త్రిష ఆనందంతో తుళ్లి పడుతున్నారనే చెప్పాలి. అదేవిధంగా నటి మంచి విజయాన్ని చూసి చాలా కాలం కావడంతో విచారంలో ఉన్న త్రిషకు కరుప్పు చిత్రం రూపంలో మంచి విజయం వరించింది. దీంతో ఈ బ్యూటీ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఇకపోతే ఆమె తన అభిమాని వల్ల ఇంకా సంతోషానికి లోనవుతున్నారప్పుడు. 

సూర్య, త్రిష జంటగా నటించిన కరుప్పు చిత్రం గత 15వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో సూర్య అభిమానుల ఆనందం గురించి పక్కన పెడితే త్రిష అభిమానులు తెగ సంబర పడుతున్నాయి. ఆమె అభిమాని ఒకరు త్రిషతో విజయ్‌ నటించిన ఢిల్లీ, అజిత్‌ నటించిన మంగాత్తా, సూర్య నటించిన ఆరు చిత్రాలు ఈ ముగ్గురు హీరోలకు చాలా మైలు రాయిగా నిలిచారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ మూడు చిత్రాల్లోనూ త్రిష నలుపు దుస్తులు ధరించారని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అందుకేనేమో ఆ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించి ఉంటాయన్నారు. 

అందువల్ల త్రిషను కరుప్పు స్టార్‌ ( బ్లాక్‌ స్టార్‌) అని పిలవవచ్చు అని ఆ అభిమాని చేసి పోస్ట్‌ త్రిష వరకు చేరింది. ఆయన పోస్ట్‌ను చూసి న త్రిష ఎంతగానో సంతోషపడి  ఇది చాలా అందంగా ఉంటుంది. ధన్యవాదా లు అని పేర్కొని  చిరునవ్వుతో కూడిన పలు ఎమోజీలను ఎక్స్‌ మీడి యాలో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement