Karan Mehra On Rajeev Sen Allegations: I Would Rather File a Defamation Suit - Sakshi
Sakshi News home page

Karan Mehra: నీ భార్యతో లింకు పెట్టకు, పరువు నష్టం దావా వేస్తా

Nov 4 2022 8:08 PM | Updated on Nov 4 2022 8:56 PM

Karan Mehra On Rajeev Sen Allegations: I Would Rather File a Defamation Suit - Sakshi

నీ భార్య చారుతో రొమాన్సా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా రాజీవ్‌ ? పదేళ్ల క్రితం ఓసారి చారును కలిశాను. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్‌ అయ్యాను. అప్పుడెప్పుడో జూన్‌లో ప్రమోషనల్‌ ఈవెంట్‌ కోసం

బుల్లితెర సీరియల్‌ నటి చారు అసోపా- రాజీవ్‌ సేన్‌ల విడాకుల వ్యవహారం గత రెండురోజులుగా చర్చనీయాంశంగా మారింది. తప్పు చేసింది నువ్వంటే నువ్వని.. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. సహ నటుడు కరణ్‌ మెహ్రాతో రొమాంటిక్‌ రీల్‌ చేసింది నిజం కాదా? అని భార్యను మీడియా ముఖంగా నిలదీశాడు రాజీవ్‌.

తాజాగా ఈ వ్యవహారంపై హిందీ బిగ్‌బాస్‌ 10వ సీజన్‌ కంటెస్టెంట్‌, నటుడు కరణ్‌ మెహ్రా స్పందించాడు. 'నీ భార్య చారుతో రొమాన్సా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా రాజీవ్‌ ? పదేళ్ల క్రితం ఓసారి చారును కలిశాను. తర్వాత ఢిల్లీకి షిఫ్ట్‌ అయ్యాను. అప్పుడెప్పుడో జూన్‌లో ప్రమోషనల్‌ ఈవెంట్‌ కోసం తనతో మాట్లాడాను. అదే చివరిసారి మేము మాట్లాడుకోవడం! ఇలా నాపై చెత్త ఆరోపణలు చేయడం దారుణం. అతడిపై పరువునష్టం దావా వేస్తాను' అని చెప్పుకొచ్చాడు. కాగా పలుమార్లు గొడవపడ్డ చారు అసోపా- రాజీవ్‌ ఈసారి మాత్రం విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

చదవండి: అంత ఈజీగా నిందలు ఎలా వేస్తారు? : నటి ఆవేదన
నటుడికి ఇల్లమ్మేసి కొత్త డూప్లెక్స్‌ కొన్న జాన్వీ కపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement