దర్శన్ భార్యకు అసభ్యకర సందేశాలు.. మహిళా కమిషన్‌ సీరియస్! | Kannada Star Hero Darshan Thoogudeepa family Harassment in Social Media | Sakshi
Sakshi News home page

Darshan Thoogudeepa: దర్శన్ భార్యకు వేధింపులు.. మహిళా కమిషన్‌ సీరియస్!

Aug 29 2025 10:27 AM | Updated on Aug 29 2025 10:41 AM

Kannada Star Hero Darshan Thoogudeepa family Harassment in Social Media

కన్నడ స్టార్దర్శన్ అభిమాని హత్యకేసులో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే సుప్రీం కోర్టు ఆయన బెయిల్ రద్దు చేయడంతో మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ప్రియురాలి పవిత్ర గౌడను కూడా అదుపులోకి తీసుకున్నారు. రేణుకస్వామి అనే అభిమాని పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడని అతన్ని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు వీరిద్దరిని అరెస్ట్చేసి జైలుకు పంపారు.

అయితే ఘటన తర్వాత దర్శన్ కుటుంబాన్ని టార్గెట్చేస్తూ కొందరు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మీతో పాటు ఆయన కుమారుడు వినీశ్పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నెలమంగళకు చెందిన భాస్కర్ ప్రసాద్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మి దర్శన్, ఆమె కొడుకును సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదాలతో దుర్భాషలాడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన మహిళా కమిషన్చర్యలకు దిగింది. అసభ్యకరమైన పోస్టులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులను ఆదేశించింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఇటీవల నటి రమ్యపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement