మీ ఆశీస్సులే మమ్మల్ని బతికించాయి: స్టార్‌ హీరో పోస్ట్ వైరల్! | Sakshi
Sakshi News home page

Dhruva Sarja: ఇది మాకు నిజంగా పునర్జన్మే: ధృవ సర్జా

Published Tue, Feb 20 2024 7:40 PM

Kannada Actor Dhruva Sarja Shares Near-Death Experience As IndiGo Flight  - Sakshi

ఇటీవల విమాన ప్రమాదాల గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాంటి అనుభవాన్ని పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానం ల్యాండింగ్‌ సమస్య రావడంతో భయాందోళనకు గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ఆ సమయంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఆమెతో పాటే ఉన్నారు.

తాజాగా అలాంటి అనుభవమే మరో స్టార్ హీరోకు ఎదురైంది. తొలిసారి మృత్యువు నుంచి ఆ దేవుడే మమ్మల్ని కాపాడారంటూ కన్నడ నటుడు ధృవ సర్జా పోస్ట్ చేశారు. నా జీవితంలో మొదటిసారి ఎదురైన చేదు సంఘటనను ఇన్‌స్టా ద్వారా షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్‌ ల్యాండింగ్‌కు ఇబ్బందులు రావడంతో మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 

ఢిల్లీ నుంచి ఓ పాట చిత్రీకరణ కోసం శ్రీనగర్‌కు ధృవ సర్జా బృందం బయలుదేరింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ చాకచక్యంగా వ్యవహరించిన సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో చిత్రబృంద సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ మాకు నిజంగా పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

ఈ ఘటన తర్వాత ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో తీవ్ర అల్లకల్లోల వాతావరణ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించడంతో శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. 

కాగా..కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించగా.. ఏపీ అర్జున్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట షూట్‌ చేసేందుకు శ్రీనగర్‌ వెళ్లారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 


 

 
Advertisement
 
Advertisement