పదేళ్ల తర్వాత మా ఇంట్లో పెళ్లి: హీరోయిన్‌ | Kangana Ranaut Brothers Getting Married Shares Video | Sakshi
Sakshi News home page

పదేళ్ల తర్వాత మా ఇంట్లో పెళ్లి: కంగన

Oct 20 2020 7:30 PM | Updated on Oct 20 2020 8:02 PM

Kangana Ranaut Brothers Getting Married Shares Video - Sakshi


డెహ్రాడూన్‌: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె సోదరుడు అక్షిత్‌ రనౌత్‌ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అతడితో పాటు కంగన కజిన్‌ కరణ్‌ వివాహం కూడా మరో మూడు వారాల్లో జరుగనుంది. దీంతో రనౌత్‌ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్‌, మెహందీ, హల్దీ(పసుపు ఫంక్షన్‌) వేడుకలతో ఇల్లంతా సందడి నెలకొంది. ఇందుకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను కంగన ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా కరణ్‌ హల్దీ వీడియోను షేర్‌ చేసిన కంగన.. ‘‘రంగోలి(కంగనా సోదరి) వివాహం జరిగి ఓ దశాబ్దం దాటిపోయింది. అప్పటి నుంచి మా కుటుంబంలో ఒక్క పెళ్లి కూడా జరుగలేదు. అందరూ నన్నే అనేవారు. (చదవండి: కంగనాపై దేశద్రోహం కేసు)

కానీ నా సోదరులు కరణ్‌, అక్షిత్‌ ఆ దురభిప్రాయాన్ని, దురదృష్టాన్ని రూపుమాపేందుకు సిద్ధమయ్యారు. మా ఇల్లు ఇప్పుడు పెళ్లి వేడుకల్లో మునిగిపోయింది. మూడు వారాల్లోనే రెండు పెళ్లిళ్లు. నేడు కరణ్‌ హల్దీ వేడుకతో ప్రారంభం’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన క్వీన్‌ సినిమాలోని లండన్‌ తుమక్‌డా పాటబ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, కంగనా తన సోదరుడికి పసుపు రాస్తూ ఆటపట్టించారు. ఎప్పుడూ సీరియస్‌ విషయాల గురించి మాట్లాడే కంగన, ఇలా సరదాగా ఉండటం చూస్తుంటే ముచ్చటేస్తుందని, ఇక మీ పెళ్లి కూడా జరిగిపోతే ఇంకా సంతోషిస్తామంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా గతేడాది నవంబరులో అక్షిత్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోదరి రంగోలితో పాటు కంగనా సందడి చేశారు. సంప్రదాయ బనారస్‌ పట్టుచీర ధరించి.. ఆటపాటలతో ఉత్సాహంగా గడుపుతూ బంధువులను పలకరించిన వీడియో అప్పట్లో వైరల్‌ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement