
చైన్నెలోని విమానాశ్రయంలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందుకుగాను చిత్ర యూనిట్ నుంచి
నటుడు కమల్ హాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం నిర్మించిన చిత్రం ఇండియన్. 1996లో విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కాగా 27 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్– 2 చిత్రం రూపొందుతోంది. కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవాని శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్‌న్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది.
ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇండియన్–2 సినిమా షూటింగ్ ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ఇటీవల చైన్నెలోని విమానాశ్రయంలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందుకుగాను చిత్ర యూనిట్ నుంచి రూ.1.04 కోట్ల విమానాశ్రయం నిర్వాహకం డిపాజిట్‌గా కట్టించుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఇటీవల ఈ చిత్రం కోసం శంకర్ చిత్రీకరించిన ఒక సన్నివేశం కమల్ హాసన్‌ను అబ్బురపరిచింది.
దీని గురించి ఆయన ట్విట్టర్‌లో పేర్కొంటూ ‘నీ బ్రహ్మాండ చిత్రీకరణ అద్భుతం. అది ఇక్కడితో ఆగి పోకూడదు. మీరు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా శంకర్‌కు ఆయన ఖరీదైన వాచ్‌ను కానుకగా అందించారు. అదేవిధంగా ఇప్పటివరకు రూపొందిన ఇండియన్–2 చిత్రాన్ని చూసిన కమల్ హాసన్ చాలా సంతృప్తిని వ్యక్తం చేశారట. ఇకపోతే ఈ చిత్రానికి పార్ట్–3 గురించి చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇండియన్ 3కి కావాల్సినంత కంటెంట్ ఉంది కాబట్టి మరో సీక్వెల్ వచ్చే అవకాశం లేకపోలేదని ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది.
‘இந்தியன் 2’ படத்தின் பிரதான காட்சிகளை இன்று பார்த்தேன். என் உளமார்ந்த வாழ்த்துகள் @shankarshanmugh
— Kamal Haasan (@ikamalhaasan) June 28, 2023
இதுவே உங்கள் உச்சமாக இருக்கக் கூடாது என்பதும் என் அவா. காரணம், இதுதான் உங்கள் கலை வாழ்வின் மிக உயரமான நிலை. இதையே உச்சமாகக் கொள்ளாமல் திமிறி எழுங்கள். பல புதிய உயரங்கள் தேடி.… pic.twitter.com/Mo6vDq7s8B
చదవండి: బ్రహ్మనందం కోసం మహేష్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే..