సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ రషా తడానీ కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ జయంతి కావడంతో యాక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
'నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను.. కానీ నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం' అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. ఈ గ్లింప్స్ ఫైట్ సీన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. జయకృష్ణ ఎంట్రీ మూవీతోనే యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడని అంటున్నారు. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందిస్తున్నారు.


