విజయ్ జన నాయగన్.. తొలి హీరోగా రికార్డ్ | Jana Nayagan: Vijay’s New CM Title Card Goes Viral in Theatres; Watch Video | Sakshi
Sakshi News home page

Jana Nayagan Movie: జన నాయగన్ మూవీ.. ఇండియాలోనే తొలి హీరోగా..!

May 6 2026 6:35 PM | Updated on May 6 2026 7:14 PM

Jana Nayagan Movie Makers Gives Surprise Video For Vijay Fans

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. పూర్తి మెజారిటీ రాకపోయినా వందకు పైగా సీట్లతో సింగిల్ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. దీంతో హీరో విజయ్ తమిళనాడు సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దళపతిన నటించిన చివరి సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఎన్నికలకు ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యలతో వాయిదా పడింది.

ఇప్పుడు విజయ్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించడంతో త్వరలోనే జననాయగన్‌ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.  ఈ నేపథ్యంలోనే మేకర్స్‌ చిన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. అభిమానుల కోసం జననాయగన్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో జననాయగన్ టైటిల్ కార్డ్‌పై దళపతి విజయ్ బదులు.. సీఎం విజయ్ అని రాసుకొచ్చారు. ఇది చూసిన అభిమానులు కేకలు వేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

‌టీఎన్ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అత్యధిక స్థానాలు గెలవడంతో మూవీ టీమ్‌ అభినందిస్తూ పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే కొందరు ఫ్యాన్స్‌ టైటిల్‌ కార్డు మార్చాలని కోరారు. ఫ్యాన్స్ విజ్ఞప్తితో  గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్‌ విజయ్‌.. అంటూ జననాయగన్‌ టైటిల్‌ కార్డు వేసింది. పోలీసు డ్రెస్‌లో నడుచుకుంటూ వస్తున్న విజయ్‌ను లుక్ అదిరిపోయింది. త్వరలో కలుద్దాం అంటూ ఈ వీడియోను థియేటర్లలో ప్రదర్శించారు. ఒక నటుడికి సీఎం టైటిల్‌ కార్డు వాడడం ఇదే తొలిసారి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశముంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement