చిరు సినిమాతో బాలనటిగా ఎంట్రీ.. పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరం | Jai Chiranjeeva Fame Shriya Sharma Latest Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: బాలనటిగా ఫుల్ ఫేమస్.. కానీ ఇప్పుడేం చేస్తుందంటే?

Apr 14 2026 5:52 PM | Updated on Apr 14 2026 5:58 PM

Jai Chiranjeeva Fame Shriya Sharma Latest Details

సినిమాలోకి ఎంతోమంది వస్తుంటారు. అంతేమంది మెల్లగా తెరమరుగైపోతుంటారు. అయితే గుర్తింపు రాక సైడ్ అయిపోతే ఓకే గానీ ఫేమస్ అయినా సరే కొందరు మూవీస్ చేయడం తగ్గించేస్తుంటారు. ఈమె కూడా అలాంటిదే. ఎందుకంటే చిరంజీవి లాంటి స్టార్ హీరో సరసన నటించి నటిగా అరంగేట్రం చేసింది. ఇప్పుడు యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. మరి ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఎవరో చెప్పేయమంటారా?

(ఇదీ చదవండి: మౌళి-మైత్రీ మూవీస్.. ఇదేం టైటిల్?)

పైన కనిపిస్తున్న నటి పేరు శ్రియ శర్మ. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన ఈమె ఐదారేళ్లకే పలు యాడ్స్ చేసింది. అలా దర్శకుల దృష్టిలో పడి ఎనిమిదేళ్లకే నటిగా మారింది. చిరు 'జై చిరంజీవ' సినిమాతో బాలనటిగా అరంగేట్రం చేసింది. తర్వాత తమిళ, కన్నడ, హిందీలోనూ పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. తెలుగులో అయితే మహేశ్ 'దూకుడు', రామ్ చరణ్ 'రచ్చ', నాని 'ఎటో వెళ్లిపోయింది మనసు' తదితర  మూవీస్‌లో కనిపించింది.

అయితే గాయకుడు, నిర్మలా కాన్వెంట్ సినిమాల్లో హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకున్న శ్రియ.. ఇవి ఫ్లాప్ అయ్యేసరికి యాక్టింగ్ పక్కనబెట్టేసినట్లు తెలుస్తోంది. 2016లో చివరగా 'నిర్మలా కాన్వెంట్' మూవీలో కనిపించింది. అప్పటినుంచి కొత్తగా ఏ మూవీ లేదా యాడ్ గానీ చేయలేదు. ఇదే టైంలో రచయితగా మారి 'కర్మ బ్యాక్ ఫైర్డ్' అనే బుక్ రాసింది. రీసెంట్‌గా 29వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమె, తన ఫొటోలని పోస్ట్ చేసింది. అలా మరోసారి సోషల్ మీడియా డిస్కషన్‌లోకి వచ్చింది. 20 ఏళ్ల పాటు సినిమాలు చేసిన శ్రియ.. భారతీయ భాషల్లో 150కి పైగా యాడ్స్‌లో నటించడం విశేషం.

(ఇదీ చదవండి: రాశీఖన్నా బ్లడీ యాక్షన్.. ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement