జగపతి బాబు, లయ, హృతిక నటించిన కొత్త సినిమా ‘వదలా’.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆసక్తిగా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ్, కిశోర్ నాయుడు నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఈ చిత్రంలో చూపించారు.


