అత్త కోసం కొత్త స్కూటీ తెచ్చిన అంకిత, కానీ.. | Intinti Gruhalakshmi June 22: Ankita Buy Scooty For Tulasi | Sakshi
Sakshi News home page

Intinti Gruhalakshmi: తులసికి స్కూటీ కొన్న అంకిత, కానీ!

Jun 22 2021 2:57 PM | Updated on Jun 23 2021 11:13 AM

Intinti Gruhalakshmi June 22: Ankita Buy Scooty For Tulasi - Sakshi

ఇంటింటి గృహలక్ష్మి జూన్‌ 22వ ఎపిసోడ్‌: తులసి ఇంట్లో మంట పెట్టేందుకు అంకిత లాస్యతో చేతులు కలిపింది. దీనికోసం ముందుగా తులసిని తన మాయమాటలు, మంచితనంతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా అసలు రంగు బయటపెట్టనుంది. అందులో భాగంగా తులసిని మాయ చేసేందుకు ఆమెకు ఓ స్కూటీ కొనివ్వాలనుకుంటుంది. ఇందుకోసం తన తల్లికి ఫోన్‌ చేస్తుంది. ఆ ఇంటిని ముక్కలు చేసేందుకు లక్ష రూపాయలు ఇవ్వలేనా? అని అడిగిన మొత్తాన్ని కూతురికి పంపిస్తుంది.

దీంతో అంకిత ఓ కొత్త స్కూటీ కొనుక్కొచ్చి అత్త ముందుంచుతుంది. అయితే దాన్ని తీసుకునేందుకు తులసి తటపటాయించడంతో 'నన్ను పరాయిదానిలా చూస్తున్నారా? మీ వారసుడిని చంపేశానని నాపై కోపమా?' అంటూ ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తుంది. ఇది నీ డబ్బుతో కాదు, మీ అమ్మ ఇచ్చిన డబ్బుతో కొన్నావు. ఆ డబ్బును అనుభవించే హక్కు నీకు మాత్రమే ఉంటుంది, అందుకే ఈ బైక్‌ వద్దంటున్నానని చెప్తుంది తులసి.

మరోవైపు లాస్య కొత్త కారు కొందామని నందు వెంటపడింది. దివ్య ఫీజు కోసం ఆ కారు అమ్మేద్దామనుకున్నాం. కానీ తులసి అలా కాకుండా చేసింది. ఇప్పుడు ఆ కారు తులసి వేసిన ముష్టిలా అనిపిస్తోంది. ఆ కారెక్కాలంటేనే కంపరంగా ఉంది. ప్లీజ్‌.. కొత్త కారు తీసుకుందాం అని ఒత్తిడి చేస్తుంది. దీంతో అయిష్టంగానే నందు ఒప్పేసుకున్నాడు.

ఇక తన అత్తామామలకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఘనంగా వేడుకలు జరిపించాలని తులసి ప్లాన్‌ చేసింది. అయితే కొడుకు రాకపోతే తాను కూడా ఫంక్షన్‌కు వచ్చేది లేదని తేల్చి చెప్పేసింది అనసూయ. మరి తులసి అందుకు ఒప్పుకుంటుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్‌లో తేలనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement