Horror Blockbuster Masooda Ott Streaming Date Locked - Sakshi
Sakshi News home page

Masooda Ott Release : హార్రర్‌ బ్లాక్‌ బస్టర్‌ మసూద ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ అక్కడే

Dec 10 2022 3:37 PM | Updated on Dec 10 2022 4:41 PM

Horror Blockbuster Masooda Ott Streaming Date Locked - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన సినిమాల్లో మసూద ఒకటి. చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ సినిమాతో సాయికిరణ్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. నవంబర్‌ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మసూద చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా మసూద డిజిటల్‌ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. ఈనెల 16 లేదా 23న మసూద చిత్రం ఆహాలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా ఈ చిత్రంలో సంగీత, తిరువీర్‌, కావ్య కల్యాణ్‌ రామ్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement