స్నేహితుల కథ  | Homebound is releasing in cinemas on 26th September 2025 | Sakshi
Sakshi News home page

స్నేహితుల కథ 

Sep 14 2025 1:23 AM | Updated on Sep 14 2025 1:23 AM

Homebound is releasing in cinemas on 26th September 2025

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ‘హోమ్‌బౌండ్‌’ సినిమా థియేటర్స్‌లో విడుదలకు సిద్ధమైంది. ఇషాన్‌ కట్టర్, విశాల్‌ జైత్య, జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘హోమ్‌ బౌండ్‌’. హైదరాబాదీ ఫిల్మ్‌ మేకర్‌ నీరజ్‌ ఘైవాన్‌ తెరకెక్కించారు. కరణ్‌ జోహార్, అదార్‌ పూనావాలా, అపూర్వ మెహతా, సోమెన్‌ మిశ్రా నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ శనివారం వెల్లడించారు.

 హాలీవుడ్‌ చిత్రనిర్మాత మార్టిన్‌ స్కోర్సెస్‌ ఈ ‘హోమ్‌ బౌండ్‌’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రొడ్యూసర్‌గా చేశారు. అంతర్జాతీయ రిలీజ్‌ను మార్టిన్‌ పర్యవేక్షిస్తున్నారట. ఇక నార్త్‌ ఇండియాకు చెందిన ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితంలో పోలీస్‌ ఆఫీసర్లుగా స్థిరపడాలనుకుంటారు. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. మరి... వారు అనుకున్నది ఎలా సాధించారు? వీరి జీవితాల్లో ఓ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనే అంశాల ఆధారంగా ‘హోమ్‌ బౌండ్‌’ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం సాగుతోంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement