
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ Hombale Films భారీ బడ్జెట్ నిర్మాణ సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ సమర్పణలో యానిమేషన్ మూవీని తెరకెక్కించారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందించిన 'మహావతార్ నరసింహ' (Mahavatar Narsimha) చిత్రం జూలై 25 థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ సినిమాను 3డీలో ప్రేక్షకులను అలరించనుంది. ప్రహ్లాదుడి చరిత్ర, విష్ణువుకు, హిరణ్యకశిపునికి మధ్య యుద్ధాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ట్రైలర్ చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను క్లీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించగా.. హోంబాలే ఫిల్మ్స్ సమర్పిస్తున్నారు.
ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతూ నిర్మాతలు మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ సిరీస్‌ను ప్రకటించారు. వారు విడుదల చేసిన క్యాలెండర్‌లో 2025లో 'మహావతార్ నరసింహ', ఆ తర్వాత 'మహావతార్ పరశురామ్' (2027), 'మహావతార్ రఘునందన్' (2029), 'మహావతార్ ధావకధేష్' (2031), 'మహావతార్ గోకులానంద' (2033), 'మహావతార్ కల్కి పార్ట్ 1' (2035), 'మహావతార్ కల్కి పార్ట్ 2' (2037) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.