అరవింద్ కృష్ణ కొత్త సినిమా యస్. ఐ.టి ఫస్ట్‌లుక్ అవుట్

అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం "యస్. ఐ. టి. (S.I.T... ) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.బి.ఆర్. దర్శకత్వం వహిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుంది. షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీ త్వరలోనే వెలువడనుంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు