సినిమాకు అదే ప్రాణం.. హనుమాన్‌పై సమంత రివ్యూ.. | Hanuman Did Magic On The Silver Screen: Samantha Review On Prasanth Varma And Teja Sajja HanuMan Movie - Sakshi
Sakshi News home page

Samantha Review On HanuMan: హనుమంతు చేసిన మ్యాజిక్‌.. చూసేకొద్దీ చూడాలనిపించేలా..

Published Fri, Jan 19 2024 1:31 PM

Hanuman Did Magic On The Silver Screen: Samantha Review On Prasanth Varma And Teja Sajja HanuMan Movie - Sakshi

సంక్రాంతి కానుకగా రిలీజైన హను-మాన్‌ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌ చిత్రంగా నిలిచింది. పాన్‌ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం తెలుగు, హిందీలో అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, హీరో తేజ సజ్జాకు లెక్కలేనన్ని ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా స్టార్‌ హీరోయిన్‌ సమంత హనుమాన్‌పై రివ్యూ ఇచ్చింది. 'మనల్ని మళ్లీ బాల్యంలోకి తీసుకెళ్లగలిగే చిత్రాలు ఎంతో ఉత్తమమైనవి. హనుమాన్‌లో విజువల్స్‌, కామెడీ, మ్యాజిక్‌, మ్యూజిక్‌.. అన్నీ ఎంతో బాగున్నాయి.

థాంక్యూ ప్రశాంత్‌ వర్మ.. నీ యూనివర్స్‌ నుంచి రాబోయే నెక్స్ట్‌ సినిమాల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను. తేజ సజ్జా.. నీ యాక్టింగ్‌తో నన్ను ఆశ్చర్యపోయేలా చేశావు. నీ కామిక్‌ టైమింగ్‌, నీ అమాయకత్వం, నీ నటన.. హనుమంతుగా నువ్వు చేసిన అద్భుతమైన నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. సంగీతం, వీఎఫ్‌ఎక్స్‌ ఈ సినిమాను మరింత అందంగా మలిచాయి. సినిమా చూసేకొద్దీ చూడాలనిపించేలా చేశాయి. ఇందులో నటించి హిట్‌ అందుకున్న వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌లకు శుభాకాంక్షలు' అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు!

whatsapp channel

Advertisement
 
Advertisement