వారిపై న్యాయపోరాటం చేస్తున్న నటి గౌతమి | Gowthami Land Occupied Others | Sakshi
Sakshi News home page

వారిపై న్యాయపోరాటం చేస్తున్న నటి గౌతమి

Aug 13 2024 6:59 AM | Updated on Aug 13 2024 8:52 AM

Gowthami Land Occupied Others

 నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి భూములున్నాయి. కారైక్కుడికి చెందిన అళగప్పన్‌..  గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు. 

సుమారు రూ. 3కోట్లకు గౌతమి భూమిని ఆమె ప్రమేయం లేకుండా విక్రయించారు. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్‌, ఆయన భార్య నాచ్చాళ్‌, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్‌, కారు డ్రైవర్‌ సతీష్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్‌ పిటిషన్‌ వేశారు. అయితే,  వారికి బెయిల్‌ ఇవ్వకూడదని గౌతమి తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement