ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా? | Sakshi
Sakshi News home page

Gam Gam Ganesha Trailer: డిఫరెంట్ గెటప్‌లో ఆనంద్.. ట్రైలర్ రిలీజ్

Published Mon, May 20 2024 5:03 PM

Gam Gam Ganesha Movie Official Trailer

గతేడాది 'బేబి' సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు రూట్ మార్చాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ 'గం గం గణేశా'తో ఎంటర్‌టైన్ చేసేయడానికి వచ్చేస్తున్నాడు. మే 31న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?

(ఇదీ చదవండి: నేనూ మనిషినే.. అలా అంటే తట్టుకోవడం కష్టం: యువ హీరోయిన్)

హీరో ఓ దొంగ. ఫ్రెండ్‌తో కలిసి జాలీగా బతికేస్తుంటాడు.  ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఓ ఊరికి వెళ్తాడు. అక్కడ వినాయకుడి విగ్రహాం దొంగతనం జరుగుతుంది. హీరో కూడా ఊహించని విధంగా ఆ దొంగతనంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే కథలా అనిపిస్తుంది. ఇప్పటివరకు కూల్‌గా ఉంటే క్యారెక్టర్స్ చేస్తూ వచ్చిన ఆనంద్.. ఈ చిత్రం కామెడీ కూడా చేశాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?)

Advertisement
 
Advertisement
 
Advertisement