
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సినీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమకు 30 శాతం వేతనాలు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం ఎంతకీ తేలట్లేదు. అయితే తాజాగా శనివారం చర్చలు జరిగిన తర్వాత నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
(ఇదీ చదవండి: నేనెవరిని కలవలేదు.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి)
రోజుకి రూ.2000, అంతకు లోపు గానీ వేతనం తీసుకునే కార్మికులకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% పెంచడానికి అంగీకరించారు. అలానే రోజుకి రూ.1000 లేదా అంతకంటే తక్కువ వేతనం తీసుకుంటున్న కార్మికులకు మొదటి ఏడాది 20% రెండవ ఏడాది 0%, మూడో ఏడాది 5% వేతనం పెంచడానికి నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. ఇప్పటికే నిర్మాతలు పెట్టిన కండిషన్స్‌కు ఫెడరేషన్ అంగీకరిస్తేనే ఈ వేతన పెంపునకు నిర్మాతలు అంగీకరిస్తారని నిర్మాతల మండలి పేర్కొంది.
ఇప్పుడు నిర్మాతలు మాట్లాడిన దానిపై ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ స్పందించారు. నిర్మాతలతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని చెప్పారు. వాళ్ల ప్రతిపాదనని తాము ఒప్పుకోలేదని, ఫెడరేషన్‌ని విభజించేలా వేతనాల నిర్ణయం తీసుకున్నారని అన్నారు. యూనియన్లంటికీ సమానంగా వేతనం పెంచాలని కోరారు. మీటింగ్ లో జరిగింది వేరు, వాళ్లు బయటకొచ్చి మాట్లాడింది వేరు అని.. నిర్మాతలు విధించిన నాలుగు షరతులకు ఒప్పుకొనేది లేదని తేల్చిచెప్పారు.
(ఇదీ చదవండి: ఇంట్రెస్టింగ్‌గా అనుపమ 'పరదా' ట్రైలర్)