The Family Man 2: వాళ్లను చంపేస్తానంటోన్న సామ్‌

The Family Man Season 2 Trailer Out Now, Release Date June 4 - Sakshi

ఫ్యామిలీ మ్యాన్‌ 2 ట్రైలర్‌ వచ్చేసింది..

శ్రీకాంత్‌(మనోజ్‌ భాజ్‌పాయ్‌).. జాతీయ దర్యాప్తు సంస్థకు చెందిన స్పెషల్‌ సెల్‌లో పని చేసే ఓ మధ్యతరగతి వ్యక్తి. అతడు తన రహస్య ఉద్యోగం, అధిక ఒత్తిడి ప్రభావం కుటుంబం మీద పడకుండా జాగ్రత్త పడాలి. కానీ ఈ క్రమంలో అతడికి ఇంటా బయటా మొండిచేయి ఎదురవుతూ ఉంటుంది. ఆఫీసులో శ్రీకాంత్‌ ఏ పనీ చేయడని..  ఇంట్లోనేమో సరిగా మాట్లాడడు అని అతడిని నిందిస్తారు.

ఈ క్రమంలో శ్రీకాంత్‌ మీద వచ్చే సన్నివేశాలు వినోదభరితంగా ఉన్నాయి. అదే సమయంలో ఉగ్రవాదులను తుద ముట్టించే సీన్లలో శ్రీకాంత్‌ ఒక సైనిక వీరుడిగా కనిపిస్తున్నాడు. మరోవైపు సమంత సూసైడ్‌ బాంబర్‌గా కనిపించింది. డీగ్లామర్‌ లుక్‌లో కనిపించిన సామ్‌.. వాళ్లను నేను చంపుతా అంటూ సవాలు విసురుతోంది. కళ్లలో ఫైర్‌, యాక్టింగ్‌లో తీవ్రత చూస్తుంటే సామ్‌ తన పాత్రను ఇరగదీసినట్లు కనిపిస్తోంది.

మొత్తానికి ఫ్యామిలీ మ్యాన్‌ 2 ట్రైలర్‌ జనాలకు తెగ నచ్చేసింది. పనిలో పనిగా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించేసారు. ఈ సిరీస్‌ జూన్‌ 4 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించారు. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శరద్ కేల్కర్, శ్రేయా ధన్వంతరి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

చదవండి: ఆర్‌సీబీ అభిమానినే కానీ, కోహ్లికి కాదు: రష్మిక

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top