
హీరోల పారితోషికాలు ఆకాశన్నంటుతున్నాయి. మామూలు హీరోలు లక్షల్లో మీడియం హీరోలు కోట్లల్లో తీసుకుంటే స్టార్ హీరోలు పదులు, వందల కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ రెమ్యునరేషన్లకే సగం బడ్జెట్ కేటాయించాల్సి వస్తోందని బాధపడే నిర్మాతలున్నారు. ఎంతెక్కువైనా సరే కానీ, ఆయా హీరోలతో కలిసి పని చేయాల్సిందేనని అడిగినంత ఇచ్చేందుకు ముందుకొచ్చే నిర్మాతలూ ఉన్నారు. అయితే వీళ్లందరూ చాలా తక్కువ మొత్తం నుంచి కెరీర్ మొదలుపెట్టినవాళ్లే.. అందులో మలయాళ స్టార్, పుష్ప విలన్ ఫహద్ ఫాజిల్ ఒకరు.
ఆ సినిమాకు రూ.1 లక్ష రెమ్యునరేషన్
చాప్ప కురిష్ సినిమాకుగానూ ఫహద్ ఫాజిల్ కేవలం రూ.1 లక్ష మాత్రమే పారితోషికం తీసుకున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ వెల్లడించాడు. తాజాగా ఆయన ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. చప్ప కురిష్ తర్వాత ఫహద్, నేను మళ్లీ సినిమా చేయలేదు. 2011లో ఆ సినిమా వచ్చింది. మొదట అతడికి నేను డబ్బు ఇవ్వలేదు. సినిమా పూర్తయ్యాకే ఇచ్చాను. దానికంటే ముందు టోర్నమెంట్ మూవీకిగానూ రూ.65వేలు తీసుకున్నట్లు చెప్పాడు. నేను నా చిత్రానికి రూ.1 లక్ష ఇచ్చాను. ఇప్పుడు రూ.5-10 కోట్లు ఇచ్చినా ఫహద్ దొరకడు.
సక్సెస్ రాలేదని వెనక్కువెళ్లిపోలేదు
ఇప్పుడతడు పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగాడు. ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతడికి తొలినాళ్లలో అంత సక్సెస్ రాలేదు. దీంతో కొంతకాలం బ్రేక్ తీసుకుని తిరిగి ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అంకితభావంతో సినిమాలు చేశాడు. తన టాలెంట్‌తో దూసుకుపోయాడు. ఓ ఇంటర్వ్యూలో ఫహద్ 'చప్ప కురిష్' తన బెస్ట్ సినిమాల్లో ఒకటని పేర్కొన్నాడు. ఆ క్లిప్పింగ్ భద్రంగా దాచుకున్నా.. సినిమాల్లోకి రావాలనుకునేవారు ఆయన్ను చూసి నేర్చుకోండి అని చెప్పుకొచ్చాడు.
చదవండి: నేను నీ డైపర్లు మారిస్తే నువ్వేమో.. అమ్మతనంపై కియారా పోస్ట్