Etlu Movie First Look Released By Minister Harish Rao - Sakshi
Sakshi News home page

Itlu Movie: సస్పెన్స్​ థ్రిల్లర్​గా 'ఇట్లు'.. ఫస్ట్​ లుక్​ విడుదల చేసిన హరీశ్​ రావు

Feb 22 2022 12:22 PM | Updated on Feb 22 2022 1:09 PM

Etlu Movie First Look Released By Minister Harish Rao - Sakshi

Itlu Movie First Look Released By Minister Harish Rao: ‘‘ఇట్లు’ టీమ్‌ని చూస్తుంటే అందరూ కొత్తవారిలా కనిపిస్తున్నారు. ధైర్యంగా సినిమాని పూర్తి చేసి, రిలీజ్‌ చేస్తుండటం అభినందనీయం’’ అన్నారు మంత్రి హరీష్‌ రావు. అమీర్, ప్రణీత, దీపిక హీరో హీరోయిన్లుగా పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకత్వంలో పూదరి రాజాగౌడ్, పూదరి రాజశేఖర్‌ గౌడ్‌ నిర్మించిన చిత్రం ‘ఇట్లు’.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని హరీష్‌ రావు రిలీజ్‌ చేశారు. ‘‘సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. త్వరలో సినిమాని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు రోషి రెడ్డి. ‘‘పోస్టర్‌ని లాంచ్‌ చేసిన హరీష్‌ రావుగారికి థ్యాంక్స్‌’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్​గా బాచిన నాగేశ్వరరావు బాధ్యతలు నిర్వర్తించారు. 

Advertisement
 
Advertisement
Advertisement