Shriya Saran First Look Released From Kabzaa Movie Viral - Sakshi
Sakshi News home page

Shriya Saran First Look: 'మధుమతి'గా శ్రియా కొత్త లుక్‌.. నెట్టింట వైరల్‌

Mar 9 2022 8:51 AM | Updated on Mar 9 2022 10:59 AM

Shriya Saran First Look Released From Kabzaa Movie - Sakshi

Shriya Saran First Look Released From Kabzaa Movie: తెలుగు ప్రేక్షకుల మదిలో హీరోయిన్‌గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది శ్రియా సరన్‌. సుమారు రెండు దశాబ్దాలుగా సౌత్‌ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు పొందుతూనే ఉంది. అయితే వివాహం అనంతరం మాత్రం అరకొర సినిమాలతో సరిపెడుతూ వచ్చింది. ప్రస్తుతం బడా హీరోలా సరసన నటించికపోయిన పెద్ద చిత్రాల్లో మాత్రం కనిపించి అలరిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే హిందీ 'దృశ్యం 2'లోనూ అజయ్‌ దేవగణ్‌కు జంటగా యాక్ట్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రియా మరో భారీ బడ్జెట్‌ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది. 

కన్నడ స్టార్‌ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం 'కబ్జా'. ఆర్. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ  చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాలో శ్రియా లీడ్‌ రోల్‌లో అలరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి శ్రియా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. 'కబ్జా' సినిమాలో శ్రియా మధుమతి అనే పాత్రలో దర్శనమివ్వనుంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సాంప్రదాయ దుస్తుల్ని ధరించి మహరాణిలా సింహాసనంలో  కూర్చున్న శ్రియా మేకోవర్‌ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, కబీర్ సింగ్‌ దుహా, బోమన్‌ ఇరానీ వంటి స్టార్‌ క్యాస్టింగ్‌ ఉంది. ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, మరాఠి భాషల్లో పాన్‌ ఇండియాగా త్వరలో విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement