క్వాలిటీ పరంగా మాది చాలా పెద్ద చిత్రం : దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం | Director Sreenath Pulakuram Talks About Prabuthwa Junior Kalashala Movie | Sakshi
Sakshi News home page

క్వాలిటీ పరంగా మాది చాలా పెద్ద చిత్రం : దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం

Jun 19 2024 6:10 PM | Updated on Jun 19 2024 6:21 PM

Director Sreenath Pulakuram Talk About Prabuthwa Junior Kalashala

‘క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా తెరకెక్కించాం. ఈ సినిమా రిహార్సల్స్, వర్క్ షాప్స్ కు కొన్ని నెలల టైమ్ కేటాయించాం. ఆర్టిస్టులను మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి  రాయలసీమ యాస నేర్పించాం. డబ్బింగ్ కోసమే 8 నెలల టైమ్ వెచ్చించాం.ఆర్టిస్టుల పరంగా మాది చిన్న సినిమానే కానీ క్వాలిటీ పరంగా చాలా పెద్ద సినిమా’ అని అన్నారు దర్శకుడు శ్రీనాథ్‌ పులకురం. 

ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పుంగనూరు-500143’. ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్  హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో దర్శకుడు  శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ.. నాకు సినిమా అంటే ఇష్టం. కానీ చాలా మందికి సినిమా అంటే వ్యాపారం. అలాంటి వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇవన్నీ దాటుకుని ఈ నెల 21న గ్రాండ్ గా మా మూవీ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.మూవీ మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా. ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ సినిమా చూశాక మీరు మీ పేరెంట్స్ ను గుర్తు తెచ్చుకుంటారు’అన్నారు. 

మేము ఇచ్చిన లిమిటెడ్ బడ్జెట్ లో ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′సినిమాను శ్రీనాథ్‌ అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను’అని నిర్మాత భువన్‌రెడ్డి కొవ్వూరి అన్నారు. ‘కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎమోషన్స్ కలిసి ఉన్న సినిమా ఇది. ఇలాంటి మంచి మూవీని సపోర్ట్ చేయండని రిక్వెస్ట్ చేస్తున్నా’ అని హీరోయిన్  షాజ్ఞ  అన్నారు. ‘ఈ సినిమా మా అందరికి చాలా స్పెషల్‌. హీరోయిన్‌తో పాటు నాక్కుడా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాను’అని హీరో ప్రణవ్‌ ప్రీతం అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement