'96' సీక్వెల్ డ్రాప్.. ఫహాద్‌తో డిఫరెంట్ సినిమా | Director Prem Kumar About Movie With Fahadh Faasil | Sakshi
Sakshi News home page

Director Prem Kumar: ఫహాద్‌తో '96' దర్శకుడి మూవీ.. పాత్రలు చాలా తక్కువ

Sep 10 2025 1:37 PM | Updated on Sep 10 2025 1:46 PM

Director Prem Kumar About Movie With Fahadh Faasil

'96'.. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ప్రేమకథలు ఇ‍ప్పటివరకు చాలా వచ్చాయి గానీ ఈ చిత్రంలో ఎమోషన్స్, స్టోరీ.. అద్భుతమైన ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చాయి. ఓ రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి, త్రిషకు ఓ రేంజు గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉందని కొన్నాళ్ల క్రితం చెప్పిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. ఇప్పుడు మనసు మార్చుకున్నట్లు అనిపిస్తుంది. డిఫరెంట్ చిత్రాలతో రాబోతున్నట్లు ప్రకటించాడు.

(ఇదీ చదవండి: కొత్త ట్రెండ్.. ఓటీటీలో యానిమేషన్ 'కురుక్షేత్రం')

చివరగా ప్రేమ్ కుమార్.. 'సత్యం సుందరం' సినిమాతో వచ్చాడు. గతేడాది ఇది రిలీజైంది. దీని తర్వాత తమిళ హీరో విక్రమ్‌తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. అయితే ఇది ఇంకా ఆలస్యం కానుంది. ఇంతలో ఫహాద్ ఫాజిల్‌తో ప్రేమ్ కుమార్ ఓ ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు. 45 నిమిషాల స్క్రిప్ట్ చెప్పానని, అది ఫహాద్‌కి చాలా నచ్చేసిందని చెప్పాడు. ఇదో యాక్షన్ థ్రిల్లర్ అని పేర్కొన్నాడు. అయితే 96, సత్యం సుందరం చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉంటాయని క్లారిటీ ఇచ్చాడు.

ఫహాద్ ఫాజిల్‌కి హీరోగా ఇది తొలి తమిళ సినిమా కానుంది. జనవరి నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇదివరకే తమిళంలో ఫహాద్ పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. వాటిలో సహాయ పాత్రలు చేశాడు. ఇప్పుడు ప్రేమ్ కుమార్‌తో మూవీ అనగానే కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత విక్రమ్‪‌తో ప్రేమ్ కుమార్ మూవీ చేస్తారు. అయితే ఈ విషయాన్ని చెప్పిన ఈ దర్శకుడు.. 96 సీక్వెల్ గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే ఇది లేనట్లే అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: నాతో బలవంతంగా ఆ సీన్స్‌ చేయించారు: 'ఆదిత్య 369' హీరోయిన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement