
చిరంజీవి, మోహన్‌బాబు, బాలకృష్ణ.. ఇలా స్టార్ హీరోలందరితోనూ నటించింది హీరోయిన్ మోహిని. ఆదిత్య 369 సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. దక్షిణాదిన అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు 100కి పైగా సినిమాలు చేసింది. తమిళ, మలయాళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. పిల్లలు పుట్టాక సినీ ఇండస్ట్రీకి దూరమైంది.
వద్దని ఏడ్చా..
చాలాకాలం తర్వాత ఆమె ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా సినీజ్ఞాపకాలను పంచుకుంది. మోహిని (Tamil Actress Mohini) మాట్లాడుతూ.. దర్శకుడు ఆర్కే సెల్వమణి కన్మణి (తమిళ సినిమా)లో ఉడాల్ తళువా.. పాటను స్విమ్మింగ్ పూల్‌లో ప్లాన్ చేశాడు. నాకసలే ఈత రాదు, అందులోనూ స్విమ్ సూట్ వేసుకోవడం చాలా అసౌకర్యంగా అనిపించింది. అదే మాట చెప్పి ఏడ్చాను. నావల్ల కాదన్నాను.

ఇష్టం లేకుండా నటించా
అప్పట్లో ఈత నేర్పించడానికి ఆడవాళ్లు లేరు, మగవాళ్లే ఉన్నారు. వాళ్ల ముందు సగం బట్టలే వేసుకుని ఈత నేర్చుకోవడానికి ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అయినా సరే ఆ పాటలో నాతో బలవంతంగా సగం దుస్తులు వేయించి స్విమ్మింగ్ పూల్‌లో షూట్ పూర్తి చేశారు. తర్వాత ఊటీలో మళ్లీ అలాంటి సీన్ చేయాలన్నారు. అప్పుడు నేనసలు ఒప్పుకోలేదు. ఆల్‌రెడీ సీన్ అయిపోయాక మళ్లీ ఇదేంటి? నేను చేయనని తెగేసి చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా మరీ గ్లామరస్‌గా కనిపించింది ఈ కన్మణి సినిమాలోనే!
చేజారిన సినిమాలు
'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మూవీలో సిమ్రాన్‌కు బదులుగా నేనే నటించాల్సింది. ముందు నన్నే అడిగారు. కానీ నేను సినిమాలు మానేశానని ఎవరో డైరెక్టర్‌కు చెప్పారట! దీంతో నా స్థానంలో సిమ్రాన్‌ను తీసుకున్నారు. ఈ విషయం దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్వయంగా నాతో చెప్పాడు. రజనీకాంత్ 'ముత్తు' సినిమాలో హీరోయిన్‌గా నన్ను తీసుకోవాలా? మీనాను సెలక్ట్ చేసుకోవాలా? అని దర్శకనిర్మాతలు సందిగ్ధంలో పడ్డారు. నన్నోసారి వచ్చి కలవమన్నారు. పనికోసం వెతుక్కుంటూ వెళ్లడం నాకిష్టం లేదు.
నాపై చేతబడి
మనకని రాసిపెట్టుంటే అది మనకే వస్తుందని ఊరుకున్నాను. వాళ్లు ఫైనల్‌గా మీనాను సెలక్ట్ చేశారు. ఇది పోతే నాకు ఎక్కడో మంచి అవకాశం ఉండే ఉంటుందనుకున్నాను. డేట్స్ కుదరకపోవడంతో చిన్న తంబి చేజారింది అని చెప్పుకొచ్చింది. పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నా భర్త కజిన్ నాపై చేతబడి చేయించింది. అప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాడు అని పేర్కొంది. మోహిని చివరగా కలెక్టర్ (2011) అనే మలయాళ మూవీలో మెరిసింది.
చదవండి: IVF ద్వారా గర్భం.. బొడ్డుతాడులో రివర్స్‌లో రక్తం.. ప్రాణం లేని బిడ్డకు జన్మనిచ్చిన నటి