పాతిక వేల సాయం.. ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు | Director G Nageswara Reddy Emotional Comments About SV Krishna Reddy Help At Middle Class Movie Event | Sakshi
Sakshi News home page

SV Krishna Redy: అప్పుడు చిన్న సాయం.. దాని విలువ రూ.5 కోట్లు!

May 28 2026 10:16 AM | Updated on May 28 2026 12:07 PM

Director G Nageswara Reddy About SV Krishna Redy Help

'ఎస్వీ కృష్ణారెడ్డిగారు లేకపోతే నేను దర్శకుడిగా ఎదిగేవాడిని కాదు' అంటున్నాడు డైరెక్టర్‌ జి. నాగేశ్వర్‌ రెడ్డి. ఈయన దర్శకత్వంలో శ్రీకాంత్‌, లయ జంటగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌'. ఈ సినిమా టీజర్‌ను బుధవారం రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇద్దర్నీ మర్చిపోలేను
ఈ సందర్భంగా జి. నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. మా అమ్మానాన్న తర్వాత నేను మర్చిపోలేని వ్యక్తులు ఇద్దరే.. ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి.. వీరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కృష్ణారెడ్డి దగ్గర పని చేయకపోయుంటే నేను దర్శకుడిని అయ్యేవాడినే కాదు. నా జీవితంలో మర్చిపోలేని ఒక సంఘటన చెప్తాను.. అప్పుడు నేను అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను. ఒకసారి డ్యామ్‌ ఎత్తేసరికి మా పంటపొలం కొట్టుకుపోయింది. పొలమంతా నీటమునిగింది. 

ఇప్పుడు దాని విలువ రూ.5 కోట్లు
ఆ సమయంలో నాకు ఎస్వీ కృష్ణారెడ్డి రూ.25 వేలు సాయం చేశారు. ఆ డబ్బు మా నాన్నకు ఇస్తే మళ్లీ పొలం బాగు చేయించాడు. ఆ 9 ఎకరాల పొలం నేడు రూ.5 కోట్లు విలువ చేస్తుంది అని చెప్పుకొచ్చాడు. మిస్టర్‌ మిడిల్‌ క్లాస్‌ సినిమా విషయానికి వస్తే ఇందులో గోవిందుడిగా రాజేంద్రప్రసాద్‌ కనిపించబోతున్నాడు.

చదవండి: వయసు ముదిరిపోతోందని ట్రోల్స్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement