-
ఆ నిమిషం!
‘‘నా కెరీర్ ‘16 టీన్స్’ అనే చిన్న సినిమాతోనే మొదలైంది. చిన్న చిత్రాల విజయాలపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాటిని ప్రోత్సహించాలి’’ అని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అన్నారు. కళా రాజేష్ దర్శకత్వంలో వేంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ పతాకంపై కోటపాటి ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ‘ఆ నిమిషం’. లోగో, టీజర్‌ను నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. ‘‘హారర్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన చిత్రమిది’’ అని ప్రసాద్‌రెడ్డి అన్నారు. ‘‘నా గురువు నాగేశ్వరరెడ్డిగారి చేతుల మీదుగా నా తొలి చిత్రం టీజర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ సిద్ధం చేశా. రెండు జంటల మధ్య జరిగిన ఘర్షణ వాళ్ల కుటుంబ జీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది? అన్నది కథ’’ అన్నారు కళా రాజేష్. -
ఊహించని కాంబినేషన్
ఇటు కామెడీ.. అటు యాక్షన్.. వీటికి తోడు కుటుంబ అనుబంధాలు, ఆప్యాయతలు మేళవించి పసందైన విందు భోజనం లాంటి సినిమా ప్రేక్షకులకు అందించాలనుకునే దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి. ఇప్పుడీ దర్శకుడు నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఓ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం. ‘ఇజం’ తర్వాత కల్యాణ్‌రామ్ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. ‘దేనికైనా రెడీ’, ‘కరెంట్ తీగ’, ‘ఈడోరకం ఆడోరకం’.. ఇలా ఇటీవల జి.నాగేశ్వరరెడ్డి తీసిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించాయి. ‘‘దర్శకుడు చెప్పిన కథకు కల్యాణ్‌రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. ‘దేనికైనా రెడీ’ తరహాలో సాగే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. భారీ సినిమాలు నిర్మించిన ఓ ప్రముఖ నిర్మాత.. కాస్త విరామం తర్వాత నిర్మించనున్న చిత్రమిది’’ అని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. అన్నట్లు... ఈ కాంబినేషన్‌ని ఎవరూ ఊహించరు కదూ. ఆ సంగతలా ఉంచితే, ‘అల్లరి’ నరేశ్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి తీసిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ త్వరలో విడుదల కానుంది. -
జస్ట్ చిల్!
సుశాంత్ కథానాయకుడిగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. జస్ట్ చిల్.. అనేది ఉపశీర్షిక. సోనమ్ ప్రీత్ బజ్వా కథానాయిక. అనూప్ రూబెన్స్ సంగీతమందించిన పాటల్ని ఈ నెల 5న విడుదల చేస్తున్నారు. చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ -‘‘వినోదాత్మక కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్‌కి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. టైమ్ మెషీన్ నేపథ్యంలో అడ్వంచరస్ జర్నీలా సాగే సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. సుశాంత్, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ వారంలోనే ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో శిల్పకళా వేదికలో ఆడియో, స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. మురళీశర్మ, పోసాని, వెన్నెల కిశోర్, రఘుబాబు, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు: శ్రీధర్ సీపాన, కూర్పు: గౌతంరాజు, కెమేరా: దాశరథి శివేంద్ర. -
సినిమా రివ్యూ: కరెంట్ తీగ
నటీనటులు: మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లీయోన్, జగపతిబాబు, సుప్రీత్, తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీ తదితరులు. సంగీతం: అచ్చు ఫొటోగ్రఫి: సతీష్ ముత్యాల నిర్మాత: మంచు విష్ణు దర్శకత్వం: జి నాగేశ్వరరెడ్డి ఆకట్టుకునే అంశాలు: కామెడీ మంచు మనోజ్ ఫెర్ఫార్మెన్స్ రకుల్ ప్రీత్ సింగ్, సన్ని లియోన్ గ్లామర్ ఫైట్స్, ఫోటొగ్రఫి క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ రొటిన్ కథ పార్వతీపురంలో గ్రామపెద్ద శివరామరాజు(జగపతిబాబు)కు ముగ్గురు కూతుళ్లు. వారిలో ఒకరు కవిత(రకుల్ ప్రీత్ సింగ్). ఆ ఊర్లో వీర్రాజు(సుప్రీత్) అనే వ్యక్తితో శివరామరాజుకు వైరం ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు (మంచు మనోజ్) వీఐపీల సంఘానికి అధ్యక్షుడిగా ఉంటాడు. ఊర్లో అన్యాయాలను ఎదిరించే రాజు, కవితలు ప్రేమించుకుంటాడు. రాజుతో ప్రేమను ఇష్టపడని కవిత తండ్రి శివరామరాజు.. తనకు నచ్చిన వ్యక్తితో కూతురు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. దాంతో కవిత, రాజులు లేచిపోవాలని నిర్ణయించుకుని.. ఊర్లో నుంచి పారిపోవడానికి సిద్ధపడుతారు. అయితే చివరి నిమిషంలో మనసు మార్చుకున్న వాళ్లిద్దరూ తిరిగి శివరామరాజు దగ్గరకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో తిరిగి వచ్చిన రాజు, కవితలను శివరామరాజు ఏంచేశాడు? వీర్రాజుతో శివరామరాజుకు మధ్య ఉన్న వైరం ఏంటి? ఏ కారణంతో రాజుతో కవిత ప్రేమను వ్యతిరేకించాడు? లేచిపోవాలనుకున్న రాజు, కవితలు ఎందుకు మనసు మార్చుకున్నారు? ఇక ఈ కథలో సన్నీ లియోన్, సంపూర్ణేష్ బాబుల పాత్రలేంటి అనే ప్రశ్నలకు సమాధానమే ’కరెంట్ తీగ’. ఎప్పటిలాగే హీరో, హీరోయిన్లు ప్రేమించుకోవడం, పెద్దలను వ్యతిరేకించడం లాంటి కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే సమాజంలో ఆడపిల్లలు పుట్టడం నేరంగా చూడకూడదు అనే పాయింట్‌ను ప్రధానంగా తీసుకుని అల్లిన కథలో రాజుగా మంచు మనోజ్.. ఓ మాస్ క్యారెక్టర్‌ను పోషించాడు. మాస్ ఎలిమెంట్స్‌కు తనదైన హాస్యాన్ని, టైమింగ్‌తో మనోజ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, సన్నీలియోన్ తో కలిసి రొమాన్స్‌ను పండించాడు. ఓ పాటను పాడటమే కాకుండా, క్యాస్టూమ్స్ డిజైన్, ఫైట్స్ విభాగాల్లో తన మార్కును చూపించాడు. మరోసారి మనోజ్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. గతంలో కంటే ఈ చిత్రంలో మనోజ్ కాస్త పుష్టిగా కనిపించాడు. ఈ విషయంలో మనోజ్ జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. గ్లామర్‌కే పరిమితి కాకుండా.. నటనకు కొంత స్కోప్ ఉండే పాత్ర రకుల్ ప్రీత్ సింగ్ కు లభించింది. తనకు లభించిన అవకాశాన్ని రకుల్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే.. ఫెర్ఫార్మెన్స్ విషయంలో కొంత మెచ్చురిటీ సాధించింది. అతిధి పాత్రలో సన్నీలియోన్ టీచర్‌గా హాట్ హాట్‌గా కనిపించించింది. ఒకే ఒక్క సీన్లో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఎంట్రీ ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహన్ని కలిగించేలా ఉంది. లెజెండ్‌తో రూట్ మార్చిన జగపతిబాబు.. ఈచిత్రంలో మరో ప్రధానమైన పాత్రను పోషించాడు. గ్రామపెద్దగా, ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఓ బరువైన పాత్రను, కథకు వెన్నెముకగా నిలిచాడు. ఎప్పటిలాగే తాగుబోతు రమేశ్, వెన్నెల కిషోర్, పృథ్వీలు తమ పాత్రల పరిధి మేరుకు పర్వాలేదనించారు. సాంకేతిక విభాగం: ఈ చిత్రానికి అచ్చు సంగీతాన్ని అందించారు. విడుదలకు ముందే ఆడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన పిల్లా ఓ పిల్లా, వరికుప్పల యాదగిరి ’పోతే పోని పోరా’, భాస్కర భట్ల ’ఎర్ర ఎర్ర చీర’, అనంత శ్రీరాం రాసిన పదహారేళ్లైనా పాటలు ఆలరించాయి. అచ్చు బ్యాక్ గ్రౌడ్ స్కోర్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే అదనంగా మరికొంత ఫీల్ తెరపై కనిపించేంది. మంచు మనోజ్ కంపోజ్ చేసిన ఫైట్స్, ఫోటోగ్రఫి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. దర్శకత్వం: మినిమమ్ గ్యారెంటి అనే బ్రాండ్ ఉన్న దర్శకుడు నాగేశ్వరరెడ్డి. మనోజ్‌లో ఉండే ఎనర్జీని చక్కగా తెరక్కించాడు. రొటిన్ కథకు కామెడీ, యాక్షన్, సెంటిమెంట్‌ను జోడించి మనోజ్‌ను కొత్తగా చూపించడానికి ప్రయత్నం చేశారు. తొలి భాగంలో కథనంలో వేగం మందగించనట్లు కనిపించినా.. సెకండాఫ్‌లో గన్ ఎపిసోడ్, జగపతిబాబు నిద్రలో నడిచే సన్నివేశాలను ఆసక్తికరంగా చిత్రీకరించి ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ పై మరికొంత శ్రద్ద పెట్టి ఉంటే.. కథలో కొంత వేగం పెరగడానికి అవకాశం ఉంటుంది. ముగింపు: కామెడీ, మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న ‘కరెంట్ తీగ’ బీ, సీ సెంటర్లోని ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే మనోజ్ కెరీర్లో భారీ విజయం చేరినట్టే. --రాజబాబు అనుముల Follow @sakshinews
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్‌రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ప్రజ్వల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement