ఆ నిమిషం! | G. NAGESWARA Reddy new movie | Sakshi
Sakshi News home page

ఆ నిమిషం!

Apr 13 2017 11:31 PM | Updated on Sep 5 2017 8:41 AM

ఆ నిమిషం!

ఆ నిమిషం!

‘‘నా కెరీర్‌ ‘16 టీన్స్‌’ అనే చిన్న సినిమాతోనే మొదలైంది. చిన్న చిత్రాల విజయాలపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి.

‘‘నా కెరీర్‌ ‘16 టీన్స్‌’ అనే చిన్న సినిమాతోనే మొదలైంది. చిన్న చిత్రాల విజయాలపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. వాటిని ప్రోత్సహించాలి’’ అని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అన్నారు. కళా రాజేష్‌ దర్శకత్వంలో వేంకటేశ్వర మూవీ ఫ్యాక్టరీ పతాకంపై కోటపాటి ప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్న ‘ఆ నిమిషం’.

లోగో, టీజర్‌ను నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. ‘‘హారర్, థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన చిత్రమిది’’ అని ప్రసాద్‌రెడ్డి అన్నారు. ‘‘నా గురువు నాగేశ్వరరెడ్డిగారి చేతుల మీదుగా నా తొలి చిత్రం టీజర్‌ విడుదల కావడం సంతోషంగా ఉంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథ సిద్ధం చేశా. రెండు జంటల మధ్య జరిగిన ఘర్షణ వాళ్ల కుటుంబ జీవితాల్ని ఎలా ప్రభావితం చేసింది? అన్నది కథ’’ అన్నారు కళా రాజేష్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement