దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి.. ఏపీ వ్యాపారవేత్తతో వియ్యం | Dil Raju Brother Son Rowdy Boys Movie Hero Ashish Reddy Marriage Fix, Know Deets Inside - Sakshi
Sakshi News home page

Actor Ashish Reddy Marriage: దిల్‌ రాజు ఇంట పెళ్లి సందడి.. ఏపీ వ్యాపారవేత్తతో వియ్యం

Published Fri, Oct 27 2023 11:26 PM

Dil Raju Son Ashish Reddy Marriage Plan - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామంది సెలబ్రిటీలు  పెళ్లి పీటలు  ఎక్కుతున్నారు. ఇప్పటికే వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠిల పెళ్లి కొద్దిరోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే.. విక్టరీ వెంకటేష్‌ కూతురు హయవాహిని ఎంగేజ్‌ మెంట్‌ కూడా ఈ మధ్యే ఘనంగా జరిగింది. మరోవైపు సంగీత దర్శకుడు కీరవాణి అబ్బాయి శ్రీసింహకు ప్రముఖ నటుడు మురళీమోహన్‌ మనుమరాలు రాగతో పెళ్లి జరగనున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

(ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!)

తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. దిల్ రాజు సోదరుడు అయిన శిరీష్ కుమారుడు, హీరో ఆశిష్ రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడట. రౌడీ బాయ్స్ సినిమాతో గతేడాది తెలుగుతెరకు పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్‌ కాలేదని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ఆశిష్‌ త్వరలో సెల్ఫిష్‌ చిత్రంతో మళ్లీ తెరపైకి రానున్నాడు. కొద్దిరోజుల క్రితం దిల్ రాజు, శిరీష్ నాన్నగారు మృతి చెందిన విషయం తెలిసిందే.  

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబంతో దిల్‌ రాజు ఫ్యామిలీ వియ్యం అందుకుంటున్నట్లు టాక్‌. దిల్‌ రాజు నాన్నగారు మరణించక ముందే ఈ పెళ్లి చర్చలు జరిగాయట. వీరి పెళ్లి పూర్తిగా పెద్దలు కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం నిర్వహించి.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఆశిష్‌ పెళ్లి సంబరాలు జరగనున్నాయిట.  ఈ విషయంపై దిల్‌ రాజు కుటుంబం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు... కానీ ఆయన అభిమానుల కోసం త్వరలో ప్రకటిస్తారని తెలుస్తోంది.


 

Advertisement
 
Advertisement