దురంధర్‌-2 కలెక్షన్స్‌.. బాహుబలి-2 రికార్డ్‌ బ్రేకయ్యే ఛాన్స్..! | Dhurandhar 2 box office collections will beat Rajamouli Bahubali 2 | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Movie: బాహుబలి-2 రికార్డ్‌ బ్రేక్.. ఇంకా ఎన్ని కోట్లు కావాలంటే?

May 1 2026 2:42 PM | Updated on May 1 2026 3:01 PM

Dhurandhar 2 box office collections will beat Rajamouli Bahubali 2

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ మూవీ దురంధర్-2. మార్చి 19న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్ జాబితాలో మూడోస్థానంలో నిలిచింది. ఈ మూవీ రిలీజై 43 రోజులైనా వసూళ్లు సాధిస్తూనే ఉంది. ఇప్పటికే పుష్ప-2 రికార్డ్ బద్దలు కొట్టిన దురంధర్‌-2 మరో క్రేజీ రికార్డ్‌పై కన్నేసింది.

ఇప్పటి వరకు దురంధర్‌-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,783.66 కోట్ల వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా రూ. 1358.51 కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ చిత్రం.. ఓవర్‌సీస్‌లో రూ. 425.15 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో రన్ అవుతోన్న ఈ మూవీ బాహుబలి-2 రికార్డ్‌కు ‍అత్యంత చేరువలో ఉంది. రాజమౌళి బాహుబలి-2 కంటే కేవలం రూ. 5 కోట్లు మాత్రమే వెనకబడి ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వసూళ్లు కొనసాగితే బాహుబలి-2ను సైతం అధిగమించేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆరో వారంలో రూ.12.40 కోట్ల వసూళ్లు రాబట్టింది.

గతేడాది రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఆదిత్య ధర్ రచన, దర్శకత్వం  వహించగా.. రణవీర్ సింగ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రాకేష్ బేడి, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement