రెండు వారాల్లోనే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. డేట్ ఫిక్స్ | Dhanush Captain Miller Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Captain Miller OTT Release Date: క్రేజీ యాక్షన్ మూవీ.. జస్ట్ రెండు వారాల్లోనే ఓటీటీలోకి

Published Fri, Feb 2 2024 12:29 PM

Dhanush Captain Miller OTT Release Date Details - Sakshi

ఓటీటీలోకి మరో స్టార్ హీరో సినిమా వచ్చేందుకు రెడీ అయిపోయింది. మొన్నీమధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థే అధికారికంగా ప్రకటించింది. దీంతో మూవీ లవర్స్ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?)

ఈ సంక్రాంతికి తెలుగులో నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'హనుమాన్' హిట్ టాక్ తెచ్చుకోవడంతోపాటు కలెక్షన్స్ పరంగానూ దూసుకెళ్తోంది. అయితే ఇదే పండక్కి తమిళ హీరోలు ధనుష్, శివకార్తికేయన్ కూడా తమ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాలనుకున్నారు. కానీ థియేటర్ల దొరక్క వాయిదా వేసుకున్నారు.

అలా ధనుష్ నటించిన యాక్షన్ మూవీ 'కెప్టెన్ మిల్లర్'.. తెలుగులో జనవరి 26న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే ఫ్లాప్ టాక్ తెచ్చుకుని చతికిలపడిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించేశారు. ఫిబ్రవరి 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే తెలుగు వెర్షన్.. జస్ట్ రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్‌లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?)

Advertisement
 

తప్పక చదవండి

Advertisement