ఓటీటీలో ధనుష్‌ మూవీ.. ఇన్నాళ్లకు మోక్షం! | Sakshi
Sakshi News home page

OTT: ధనుష్‌ యాక్షన్‌ మూవీ.. ఇన్నాళ్లకు రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

Published Fri, Mar 1 2024 5:40 PM

Dhanush Captain Miller Hindi Version Release Date Update - Sakshi

ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమాలన్నీ పోటీపడ్డాయి. మహేశ్‌బాబు గుంటూరు కారం, వెంకటేశ్‌ సైంధవ్‌, నాగార్జున నా సామిరంగతో పాటు తేజ సజ్జ హనుమాన్‌ కూడా సంక్రాంతి బరిలో దిగింది. అయితే పెద్ద సినిమాలను వెనక్కినెట్టి హనుమాన్‌ విజేతగా నిలిచింది. సైంధవ్‌ మినహా మిగతా రెండు చిత్రాలు భారీగానే కలెక్షన్స్‌ రాబట్టాయి. నిజానికి ఈ చిత్రాలతో పాటు ధనుష్‌ యాక్షన్‌ మూవీ కెప్టెన్‌ మిల్లర్‌ కూడా తెలుగులో రిలీజ్‌ కావాల్సి ఉంది.

మొత్తం ఎన్నికోట్లు వచ్చాయంటే?
కానీ థియేటర్లు దొరక్కపోవడంతో ఇక్కడ ఆలస్యంగా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ సాధారణ వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. తమిళనాట మాత్రం హిట్‌ కొట్టింది. ఓవరాల్‌గా రూ.104 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మూవీని అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. హిందీ వర్షన్‌ మాత్రం విడుదల చేయలేదు.

ఇక హిందీలో చూడొచ్చు
తాజాగా హిందీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. ఓటీటీకి వచ్చిన నెల రోజులకు హిందీలోనూ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. మార్చి 8 నుంచి హిందీ వర్షన్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ధనుష్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హమ్మయ్య.. ఇక హిందీలో చూడొచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రాన్ని అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించాడు. భారీ పీరియాడికల్‌ కథగా తెరకెక్కించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతమందించారు.

చదవండి: మందు తాగే అలవాటు లేదు.. బూతులు తిట్టాడు.. అందుకే అలా చేశానంటూ ఏడ్చేసిన నటి

 
Advertisement
 
Advertisement