ఖర్చు రూ.1400 కోట్లు.. వచ్చింది రూ.6 కోట్లు! | Desert Warrior Movie Collection And Result | Sakshi
Sakshi News home page

Desert Warrior: ప్రతిష్ఠాత్మక సినిమా.. అరవీర భయంకర డిజాస్టర్

May 9 2026 9:12 PM | Updated on May 10 2026 12:03 PM

Desert Warrior Movie Collection And Result

ఒకప్పటితో పోలిస్తే సినిమాలకు క్రమక్రమంగా ఆదరణ తగ్గుతూ వస్తోంది. స్టార్ వాల్యూ ఉన్నాసరే కంటెంట్ అద్భుతంగా ఉందా లేదా అనేది ప్రేక్షకులు చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. అలాంటిది సౌదీ అరేబియాలో ప్రతిష్ఠాత్మకంగా తీసిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ప్రపంచంలోనే అరివీర భయంకరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడీ విషయం సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: విజయ్-త్రిష పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది: నటి)

'డిసర్ట్ వారియర్' పేరుతో రూ.1400 కోట్లు ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమాకు రూపర్ట్ వ్యాట్ దర్శకత్వం వహించగా.. హాలీవుడ్ నటులైన ఆంటోనీ మాకీ, బెన్ కింగ్‌స్లే ప్రధాన పాత్రలు పోషించారు. సౌదీ ప్రభుత్వం మద్దతుతో నిర్మించడం అంతర్జాతీయ ‍స్థాయిలో సౌదీ సినిమా ఇండస్ట్రీని నిలబెట్టే ప్రాజెక్ట్ అని ప్రచారం చేశారు. తీరా చూస్తే రిలీజ్ తర్వాత పూర్తిగా తేలిపోయింది.

ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోని ఈ సినిమాలో బలహీనమైన స్టోరీ, గందరగోళమైన స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ సరిగా లేకపోవడం లాంటివి మైనస్ అయ్యాయని విమర్శకులు చెప్పుకొచ్చారు. ఉత్తర అమెరికాలో 1000కి పైగా థియేటర్లలో రిలీజైతే ఒక్కో థియేటర్ నుంచి 500 డాలర్ల కంటే తక్కువ కలెక్షన్ రావడం సినిమా పరిస్థితి ఏంటో చెప్పకనే చెప్పింది. అలా గత నెల 24న థియేటర్లలో రిలీజైతే రూ.6 కోట్ల లోపు వసూళ్లు వచ్చినట్లు సమాచారం.

ఈ సినిమా ఫలితం బట్టి అర్థమైంది ఏంటంటే.. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు ఉన్నాంత మాత్రాన మూవీ హిట్ అవ్వదని, వందల కోట్ల రావు అని తేలింది. చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని వరస్ట్ రికార్డ్ ఈ సినిమా సొంతం చేసుకుంది!

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగు రివ్యూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement