అభిమానికి కరోనా..స్వయంగా ఫోన్‌ చేసిన చిరంజీవి

Chiranjeevi Talks With His Fan Who Admitted Hospital Due To Covid 19 - Sakshi

సాక్షి, కాకినాడ : కరోనాతో ఆసుపత్రిలో చేరిన తన అభిమానికి స్వయంగా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలానికి చెందిన చిరంజీవి అభిమాని ఒకరు కరోనాతో కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న చిరంజీవి నేరుగా అతడికి ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

త్వరగానే తగ్గిపోతుందని, భయపడొద్దని చెప్పి అతడిలో ధైర్యాన్ని నింపారు. పెద్ద డాక్టర్‌తో మాట్లాడనని, త్వరగా కోలుకుంటావని చెబుతూ అభిమానికి అండగా నిలిచారు. అయితే తను ఎంతగానో ఆరాధించే చిరంజీవి స్వయంగా తనకు ఫోన్‌ చేసి ఆరోగ్యంపై ఆరా తీయడంపై ఆయన అభిమాని ఎంతో సంతోషిస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి నుంచి ఫోన్‌ రావడం మర్చిపోలేని అనుభవమని పేర్కొన్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top