Chiranjeevi : 'అవసరం వచ్చినప్పుడు భుజం కాస్తా.. నాకంటే పెద్దవాళ్లు ఉన్నారు'

Chiranjeevi Speech At Inauguration Of Chitrapuri Colony Houses - Sakshi

పెద్దరికం అనుభవించాలని తనకు లేదని, ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్లు చాలామంది ఉన్నారని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.అనిల్, దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారు.దాసరి నారాయణ, రాఘవేంద్రరావు వంటి పెద్దలు దీనికి చాలా కృషి చేశారు.

ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైంది.భారతదేశంలో ఎక్కడా ఇలాంటి గృహసముదాయం లేదు. ఇక చిత్రపురి కాలనీలో అవినీతి, అవకతవకలు జరిగాయని  అన్నారు.. కానీ ఆ విషయం గురించి నాకు తెలియదు కాబట్టి మాట్లాడటం అసంబద్ధమే అవుతుంది. సినీ కార్మికులకు ఎప్పుడు, ఏ సహాయం కావాలన్నా నేను సపోర్ట్‌గా ఉంటాను. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా.

కోరుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు. నన్ను అందరూ చిత్ర పరిశ్రమకు పెద్దోడు అంటున్నారు.పెద్దరికం అనుభవించాలని నాకు లేదు నాకంటే చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్లు చిన్నవాళ్లుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదములు'' అంటూ పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top