Chiranjeevi: Mega Star Launch First Look Of Koti Son Upcoming Movie - Sakshi
Sakshi News home page

కోటి తనయుడికి చిరు సాయం.. మెగాస్టార్‌ చేతుల మీదుగా ఫస్ట్‌లుక్‌

Nov 10 2021 10:41 AM | Updated on Nov 10 2021 11:41 AM

Chiranjeevi Launch The First Look Of Koti Son Upcoming Movie - Sakshi

కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలతో అలరిస్తున్న కోటి తనయుడు రాజీవ్ సాలూర్ హీరోగా టైగర్ హిల్స్ ప్రొడక్షన్, స్వస్తిక ఫిలిమ్స్ పతాకాలపై 'ప్రొడక్షన్ నెంబర్ 1'గా ఓ కొత్త సినిమా రూపొందుతోంది. కిట్టు నల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గాజుల వీరేష్ (బళ్లారి) నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వర్ష విశ్వనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి సాలూర్ ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం. సదన్, లావన్య, రాజా రవీంద్ర, రాజా శ్రీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారు. తాజాగా ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాకు మెగా సపోర్ట్ లభించింది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరిగేలా ప్లాన్ చేశారు. నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ వదిలింది చిత్రయూనిట్. 

 ఈ సినిమాకు మణిశర్మ అందిస్తున్న సంగీతం మేజర్ అసెట్ కానుందని అంటున్నారు దర్శకనిర్మాతలు. తమ సంస్థ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని, చిత్రంలో రాజీవ్ సాలూర్ నటన హైలైట్ కానుందని అన్నారు నిర్మాత గాజుల వీరేష్ (బళ్లారి). రాజీవ్ సాలూర్, వర్ష విశ్వనాథ్ మధ్య కెమిస్ట్రీ నేటితరం ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement