
Chiranjeevi Financially Helps His Fan Daughter Marraige: మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అభిమానులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే చిరు తాజాగా కష్టాల్లో ఉన్న తన అభిమానికి చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే.. రాజం కొండలరావు అనే వీరాభిమాని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటీవలె ఆయన కూతురు నీలవేణి పెళ్లి కుదిరింది. ఈ విషయం తెలిసిన చిరంజీవి వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు ఈ విషయాన్ని చిరంజీవి అభిమానుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
లక్షణనమైన పెళ్లికూతురు నీలవేణి కి మెగాస్టార్ ఆశీస్సుల లక్ష రూపాయలు విరాళం.
— Ravanam Swami naidu (@swaminaidu_r) February 1, 2022
రాజాం కొండలరావు గారు మొదట్నుంచీ శ్రీ చిరంజీవి గారి వీరాభిమాని.ఆయన కూమార్తె నీలవేణి పెళ్లి కుదిరింది. సమాచారం అందుకున్న @KChiruTweets గారు లక్షరూపాయల ఆర్ధిక చేయూతనిచ్చి పెళ్లి సజావుగా జరిపించమన్నారు pic.twitter.com/YVmpUaSR4b