చిరంజీవి-నాని.. ఒకే సినిమాలో? | Chiranjeevi Acts Nani Paradise Movie | Sakshi
Sakshi News home page

Chiranjeevi Nani: టాలీవుడ్‌లో కొత్త సినిమాటిక్ యూనివర్స్?

Jun 1 2026 2:36 PM | Updated on Jun 1 2026 3:13 PM

Chiranjeevi Acts Nani Paradise Movie

ఇప్పుడు హీరోలు కూడా ట్రెండ్‌కి తగ్గట్లే సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వయలెన్స్, బీభత్సమైన యాక్షన్ లాంటి అంశాలతో సినిమాలు వస్తున్నాయి. నాని 'ద ప్యారడైజ్' ఈ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ మూవీలో ఇప్పుడు చిరంజీవి కూడా నటించబోతున్నారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

'దసరా'తో తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు నాని మరో ఛాన్స్ ఇచ్చాడు. అదే 'ప్యారడైజ్'. లెక్క ప్రకారం ఈ పాటికే అంటే మార్చిలోనే రిలీజైపోవాలి. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. ఇప్పటివరకైతే ఆగస్టు 21న అని ఫిక్స్ అయ్యారు. ఈ చిత్ర క్లైమాక్స్‌లోనే చిరంజీవి కనిపిస్తారనేది లేటెస్ట్ రూమర్.

'ప్యారడైజ్' మొదలైన కొన్నాళ్లకే చిరు-శ్రీకాంత్ ఓదెల్ కాంబోపై ప్రకటన వచ్చింది. నాని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ మూవీకి 'ప్యారడైజ్'తో లింక్ చేస్తున్నారట. అంటే రెండు చిత్రాల్లోని హీరోల పాత్రలకు ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. అందుకు తగ్గట్లే శ్రీకాంత్ ఓదెల స్క్రిప్ట్ రాసుకున్నాడని అంటున్నారు. మరి ఇదే నిజమైతే 'ప్యారడైజ్' విషయంలో హైప్ పెరగడం గ్యారంటీ. అలానే టాలీవుడ్‌లో మరో సినిమాటిక్ యూనివర్స్ మొదలవుతుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement