మా టీమ్‌ సక్సెస్‌ సీక్రెట్‌ అదే

Bunny Vasu reveals his team success secret - Sakshi

బన్నీ వాసు 

‘‘వినరో భాగ్యము విష్ణు కథ’ విషయంలో కొత్తవారి మీద చాలా ఎక్కువగా ఖర్చు పెట్టారా? అని కొందరు అడుగుతున్నారు. అల్లు అరవింద్‌గారి క్రమశిక్షణ వల్ల  మా ఖర్చు హద్దుల్లో ఉంటుంది. అదే మా టీమ్‌ సక్సెస్‌ సీక్రెట్‌’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు.  కిరణ్‌ అబ్బవరం, కాశ్మీర  జంటగా మురళీ కిషోర్‌ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. 

అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్‌ ఈవెన్‌ అయిన చిత్రమిది. ఇప్పుడిప్పుడే ‘కేజీఎఫ్, విక్రమ్‌’ వంటి సినిమాల ఫార్మాట్లకు ప్రేక్షకులు అలవాటుపడుతున్నారు. కొత్త దర్శకులకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీశాం’’ అన్నారు.

‘‘ఈ సినిమాతో మా అందరికీ గౌరవం వచ్చింది.. ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. ‘‘మా చిత్రం కేవలం నంబర్‌ నైబర్‌ కాన్సెప్ట్‌ కోసం తీసింది కాదు. అమ్మ సెంటిమెంట్‌ కూడా ఉంది’’ అన్నారు మురళీ కిషోర్‌ అబ్బూరు. నిర్మాత ఎస్‌కేఎన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతన్‌ భరద్వాజ్‌ మాట్లాడారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top