ముచ్చటగా మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్‌.. వైరల్‌ | Britney Spears Engagement to Boyfriend Sam Asghari | Sakshi
Sakshi News home page

Britney Spears: ముచ్చటగా మూడోసారి బ్రిట్నీ స్పియర్స్ ఎంగేజ్మెంట్‌.. వైరల్‌

Published Mon, Sep 13 2021 8:55 PM | Last Updated on Mon, Sep 13 2021 9:32 PM

Britney Spears Engagement to Boyfriend Sam Asghari - Sakshi

బ్రిట్నీ స్పియ‌ర్స్‌... పాప్‌ సాంగ్స్‌ వినేవారికి ఈ పేరు సుపరిచితమే. తన పాటలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కాగా ఆమెకు బాయ్‌ఫ్రెండ్ సామ్ అస్గారితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు షేర్‌ చేసింది. 

బ్రిట్నీ స్పియ‌ర్స్‌ (39)కి వ్యక్తిగత శిక్షకుడు, నటుడు అస్గారి (27)తో 2016లో పరిచయం అయ్యింది. అనంతరం వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ఆమె వివిధ కారణాల వల్ల తన తండ్రి సంరక్షణ, నియంత్రణలో ఉండడం వల్ల అతనితో పెళ్లి విషయం ముందుకు కదలలేదు. కానీ ఇటీవలే లాస్‌ ఎంజెల్స్‌ కోర్టు తండ్రిని సంరక్షకుడిగా తొలగించడంతో గాయనికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. దీంతో బాయ్‌ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్‌ చేసుకొని ఆ వీడియోలు, ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోగా అవి వైరల్‌గా మారాయి.

అయితే 39 ఏళ్ల బ్రిట్నీకి ఇంతకుముందే కెవిన్ ఫెడెర్‌లైన్‌ను వివాహం చేసుకొని ఇద్దరూ పిల్లలకు తల్లైంది. ఇప్పుడు వారిలో ఒకరికి 14, మరొకరికి 15 ఏళ్లు. అతనితో విడాకుల అనంతరం చిన్ననాటి స్నేహితుడు జాసన్ అలెగ్జాండర్‌ని పెళ్లాడింది. అతని నుంచి విడిపోయిన ఈ పాప్‌ సింగర్‌ తాజాగా 27 ఏళ్ల అస్గారితో ఎంగేజ్మెంట్‌ చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement