విక్రమ్‌ వేదా లేదా? | Bollywood talk that Aamir Has dropped From Vikram Veda Movie Remake | Sakshi
Sakshi News home page

విక్రమ్‌ వేదా లేదా?

Dec 21 2020 3:37 AM | Updated on Dec 21 2020 3:37 AM

Bollywood talk that Aamir Has dropped From Vikram Veda Movie Remake - Sakshi

ఆమిర్‌ ఖాన్‌

మాధవన్, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటించిన తమిళ యాక్షన్‌ చిత్రం ‘విక్రమ్‌ వేదా’. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్‌లో ఆమిర్‌ ఖాన్, సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఆమిర్‌ తప్పుకున్నారని బాలీవుడ్‌ టాక్‌.

హిందీకి తగ్గట్టు చేసిన మార్పులు మిస్టర్‌ ఫర్ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌కి అంతగా నచ్చినట్టు లేవన్నది ముంబై వార్త. ప్రస్తుతం ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు ఆమిర్‌. ఇది పూర్తయిన వెంటనే ‘విక్రమ్‌ వేదా’ రీమేక్‌ సెట్స్‌ మీదకు వెళ్లాలి. కానీ ఇప్పుడు ఆయన కమిట్‌ అయిన మరో సినిమా ‘మొఘల్‌’ను సెట్స్‌ మీదకు తీసుకెళ్తారట. సంగీత సామ్రాట్‌ గుల్షన్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ‘మొఘల్‌’ తెరకెక్కనుంది.  

Advertisement
 
Advertisement
Advertisement