Bigg Boss OTT Logo, Title: డిస్నీ+హాట్‌స్టార్‌పై నాన్‌స్టాప్‌గా ప్రసారం కానున్న బిగ్‌బాస్ ఓటీటీ

Bigg Boss Telugu OTT: Bigg Boss Non Stop New Logo Released - Sakshi

‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ ఇప్పుడు 24 గంటల వినోదాన్ని నేరుగా బిగ్‌బాస్ హౌస్ నుంచి డిస్నీ+హాట్‌స్టార్ ద్వారా అందిస్తామని వాగ్ధానం చేస్తుంది. ఈ వినోద అద్భుతం త్వరలోనే మీ అరచేతుల్లోకి రాబోతుంది. అత్యంత ఆసక్తిని పెంచే హౌస్‌మేట్స్‌తో బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్ రూపుదిద్దుకుంటుంది.

చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే..

ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ ఈరోజు(బుధవారం) లోగోను డిస్నీ+హాట్‌స్టార్ తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్‌లో విడుదల చేసింది. ఈ లోగో ఓ శక్తివంతమైన కళాఖండంలా ఉంటుంది. నీలం, ఎరుపు రంగులు శక్తిని తెలుసుకోవాలనే ఆసక్తికి ప్రతీకలుగా నిలువడమే కాదు, యూనివర్శల్ టచ్‌నూ అందిస్తాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఈ సంవత్సరం అతి పెద్ద వినోద అధ్యాయానికి మీ కోసం తెరతీయబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, బిగ్‌బాస్ నాన్‌స్టాప్ కోసం సిద్ధమైపోండిక.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top