బిగ్‌బాస్‌ 7లో బుల్లితెర నటి శోభా శెట్టి! ఎంట్రీ ఇస్తే.. | Bigg Boss Telugu 7: Shobha Shetty May Enter into BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ షోలోకి కార్తీక దీపం మోనిత.. ఈసారి పక్కానా?!

Jul 26 2023 1:33 PM | Updated on Sep 2 2023 2:34 PM

Bigg Boss Telugu 7: Shobha Shetty May Enter into BB House - Sakshi

మోనిత.. పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుంది. ఈ ఫేమస్‌ పాత్రల్లో ఒకరైన మోనిత అలియాస్‌ శోభా శెట్టి త్వరలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైం

సినిమాల్లో ట్విస్టులు వెతుక్కోవాలి.. అదే సీరియల్‌లో అయితే రోజుకో ట్విస్టు ఉంటుంది. ఊరిస్తూ, ఊరడిస్తూ, ఉత్కంఠ రేకెత్తిస్తూ, మెప్పిస్తూ ముందుకు సాగుతుంటాయి ఈ ధారావాహికలు. అందుకే చాలామంది సీరియల్స్‌ చూస్తుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు.. సినిమాలు, షోల కన్నా కూడా సీరియల్స్‌కే పెద్ద పీట వేస్తుంటారు. అలా అందరి అభిమానాన్ని చూరగొని కొన్ని సంవత్సరాలపాటు టాప్‌ పొజిషన్‌లో ఉన్న సీరియల్‌ కార్తీక దీపం.

ఇటీవలే ఈ సీరియల్‌ ముగిసిపోయింది కానీ ఇందులో నటించిన వాళ్ల క్రేజ్‌.. ఏమాత్రం తగ్గలేదు. డాక్టర్‌ బాబు, వంటలక్క, మోనిత.. ఈ పాత్రలు ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయాయి. ఈ ఫేమస్‌ పాత్రల్లో ఒకరైన మోనిత అలియాస్‌ శోభా శెట్టి త్వరలో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కాకపోతే ఈసారి సీరియల్‌ ద్వారా కాదు, రియాలిటీ షో ద్వారా! త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో శోభా శెట్టి పాల్గొనబోతుందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. బిగ్‌బాస్‌ 6లోనూ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం నడిచింది, కానీ అప్పుడు కార్తీక దీపం సీరియల్‌ చేతిలో ఉండటంతో దాన్ని వదిలి రాలేకపోయింది.

ఈసారి నో చెప్పడానికి ఏ సాకూ కనిపించడం లేదు. కాబట్టి ఈ సీజన్‌లోకి నటి ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఈమె వస్తే సీరియల్‌ ప్రేమికులంతా శోభాకే జై కొడతారు. అందంతో అందరినీ బుట్టలో వేసుకునే ఈమె తన ఆటతీరుతో ఆ ఓటు బ్యాంకును అలాగే కాపాడుతుందేమో చూడాలి! ఏదేమైనా అందాల రాశి శోభ ఎంట్రీ ఇస్తే గనక బిగ్‌బాస్‌ హౌస్‌ శోభాయమానంగా వెలిగిపోవడం ఖాయం.

చదవండి: రూ.10 వేల కోట్ల ఆస్తులకు మహారాణి.. దివాలా దెబ్బతో పతనం.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
అందం కోసం సర్జరీ చేసుకున్న హనీరోజ్‌?
ఆ రెండింటి కోసమే పెళ్లి చేసుకోవాలనుకున్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement