బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ | Bigg Boss Telugu 7 Promo: Contestants Burn Nominee Photos During Nominations | Shobha Shetty Vs Shivaji - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu: నామినేషన్‌ ప్రక్రియలో బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ

Published Mon, Oct 23 2023 12:02 PM

Bigg Boss Shobha Fire On Shivaji - Sakshi

బిగ్‌ బాస్‌ ఎనిమిదో వారం నామినేషన్స్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఎప్పిటిలాగే ఈ వారం కూడా హౌస్‌లో నామినేషన్స్‌ రచ్చ భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం చూస్తే ఈసారి శివాజీని శోభ ఢీ కోట్టినట్లు కనిపిస్తుంది. గతవారంలో శోభ- ప్రియాంకల మీద బూతు పదాలతో భోలే షావాలి విరుచకపడ్డాడు. దీంతో వారిద్దరూ కూడా అదే రేంజ్‌లో తిప్పికొట్టారు. దీనిని తప్పుబడుతూ శోభను నామినేషన్‌ చేస్తున్నట్లు శివాజీ చెప్పాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌తో గౌతమ్‌ నామినేషన్‌ వాగ్వాదం నడిచింది.

హౌస్‌లో ఆడపిల్లలపై బూతులు.. సమర్థించిన శివాజీ
శోభ- ప్రియాంకలపై  గతవారంలో భోలే షావాలి బూతు మాటలు అన్నాడు. ఆ మాటలు తెలంగాణ మాండలికంలో అత్యంత దారుణమైనవి. అది గమనించిన ప్రియాంక శోభకు తెలిపి వెంటనే రియాక్ట్‌ అయ్యారు. తూ... అంటూ భోలేపై ప్రియాంక విరుచుకుపడింది. ఆపై వెంటనే ప్రియాంక క్షమాపణ కోరింది. కానీ బూతు మాటలు మాట్లాడిన భోలే అప్పటికి కనీసం క్షమాపణ కూడా కోరలేదు. కొంత సమయం తర్వాత బిగ్‌ బాస్‌ వార్నింగ్‌ ఇచ్చాక భోలే క్షమాపణలు కోరాడు. 

ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడే ఉన్న వేరే లేడీ కంటెస్టెంట్లు గానీ, మేల్ కంటెస్టెంట్లు గానీ కిక్కుమనలేదు. అన్నింట్లో వేలు పెట్టే శివాజీ కూడా భోలేను ఒక్కమాట అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం భోలే చేసింది తప్పే అంటూ కలరింగ్‌ ఇస్తున్నాడు శివాజీ. పైగా నేడు ఇదే గొడవను మళ్లీ తెరపైకి తెచ్చి శోభను నామినేట్‌ చేశాడు. అదే బూతు పదం శివాజీ కుటుంబ సభ్యులను అంటే తీసుకుంటాడా..? సారీ చెబితే సంతోషిస్తాడా..? వాళ్లిద్దరూ కూడా ఆడపిల్లలు.. భోలే మాటలకు కన్నీరు పెట్టలేదు. శివంగుల్లా తిరగబడ్డారు. తన మనసులో ఏదైతే ఉందో అదే బయటకు  చెప్పారు. భోలేను క్షమిస్తున్నారా అని నాగార్జున అడిగినా.. లేదు సార్‌ అని చెప్పారు. అంతలా భోలే మాటలు వారిని బాధించాయి.

కనీసం ఈ సోయ కూడా లేకుండా శోభ పేరును శివాజీ ఎలిమినేషన్‌ ప్రక్రియలో చేర్చాడు. దీంతో భోలే వాడిన బూతులను శివాజీ సమర్థించినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా పట్టని కొన్ని పీఆర్‌ టీమ్‌ వాల్లు కావాలని తెలుగు వెబ్‌సైట్లతో ఆమె మీద వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఒక ఆడపిల్లను అంత మాట అనేశాడే అనే సోయ కూడా లేకుండా భోలే,శివాజీ లాంటి వారి కోసం పీఆర్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అయినా సరే ఆమె మరింత గట్టిగా ఆటలో నిలబడుతోంది.

Advertisement
Advertisement