
బిగ్‌బాస్ 9 (Bigg Boss 9 Telugu) ఈసారి స్పెషల్‌గా ఉండబోతోంది. కారణం.. సామాన్యుల ఎంట్రీ! గతంలోలాగా ఎవరో ఒకర్ని తీసుకురాలేదు. సత్తా ఉన్న సామాన్యులనే తీసుకురావాలని అగ్నిపరీక్ష షో నిర్వహించారు. వేలాది మంది అప్లై చేసుకోగా వారిలో 15 మందిని అగ్నిపరీక్షలో పరీక్షించారు. చివరకు 13 మంది మిగిలారు. ఇప్పుడు వారందరూ బిగ్‌బాస్ 9కి వచ్చారు.
ఆరుగురికి ఎంట్రీ
అగ్నిపరీక్ష షోకి శ్రీముఖి యాంకర్‌గా వ్యహరించగా, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జిలుగా వ్యవహరించారు. అభిజిత్ మినహా మిగతా ముగ్గురు నేడు స్టేజీపైకి వచ్చారు. షోలో ఎల్లో కార్డులతో కంటెస్టెంట్లను భయపెట్టిన వీరు గ్రీన్ కార్డులతో కంటెస్టెంట్లలో కొత్త ఆశలు రేకెత్తించారు. నవదీప్.. దమ్ము శ్రీజను, బిందు మాధవి.. హరీశ్‌ను సెలక్ట్ చేసి హౌస్‌లోకి పంపించారు.
ప్రేక్షకుల ఓట్లతో ముగ్గురు
నువ్వు మనిషివే కాదంటూ హరీశ్‌ను తిట్టిన బిందుమాధవి.. అందర్నీ కాదని అతడిని సెలక్ట్ చేయడం విశేషం. ప్రేక్షకుల ఓట్లతో పవన్ కల్యాణ్, డిమాన్ పవన్, డాక్టర్ ప్రియ హౌస్‌లోకి వెళ్లారు. చివర్లో నాగ్ షో ముగించేస్తుంటే శ్రీముఖి ఆపండంటూ ఎంట్రీ ఇచ్చింది. ఇంకొక్కరిని లోనికి పంపించమని వేడుకుంది. అభిజిత్, తాను కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ మర్యాద మనీష్‌ను సెలక్ట్ చేసింది. అలా ఏడుగురు కంటెస్టెంట్లు సామాన్యుల కేటగిరీలో హౌస్‌లోకి వెళ్లారు.