
ఊహకందని మార్పులు..ఊహించని మలుపులు. డబుల్ హౌస్‌తో డబుల్ జోష్‌తో మీ ముందుకు వచ్చేసింది బిగ్‌బాస్ నైన్ అంటూ బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కొత్త ప్రోమో రిలీజైంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాల్టీ షో.. తొమ్మిదో సీజన్ నేడు(సెప్టెంబర్ 7) గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ షోకి సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రోమోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీ కంటెస్టెంట్ వాయిస్ మాత్రమే వినిపించారు. వారు ఎవరనేది గుర్తుపట్టకుండా ప్రోమోని కట్ చేశారు. అయితే తొలి రోజే ఓ కంటెస్టెంట్‌కి షాకిచ్చినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది.
ఓ కంటెస్టెంట్ హౌస్‌లోకి గిఫ్ట్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా బిగ్‌బాస్ తిరస్కరిస్తాడు. దీంతో, ‘నువ్వు ఇంటికెళ్లిపోవచ్చు’ అని నాగార్జున చెబుతారు. గత సీజన్లకు ఇది పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి రెండు హౌస్‌ల ఉండబోతున్నాయి. టాస్క్‌లు కూడా కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ ఈసారి అధిక ప్రాధాన్యం ఇచ్చారు.
కంటెస్టెంట్స్ వీళ్లే..
ఈ సారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి వెళ్లబోతున్నారట. వారిలో 9 మంది డైరెక్ట్‌గా హౌస్‌లోకి వెళ్లగా, మిగతా 5 మంది అగ్ని పరీక్షలో గెలిచిన వాళ్లు వెళ్తారు. సెలెబ్రిటీ లిస్ట్‌లో ‘రాను బొంబాయికి రాను’ సాంగ్ సింగర్, డ్యాన్సర్ రాము రాథోడ్, ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన సంజన గల్రానీ, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సీనియర్ హీరోయిన్ ఆశా షైనీ, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్, తనూజ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. కామనర్స్‌గా కామనర్స్‌గా శ్రీజ, పవన్ కల్యాణ్, మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వెళ్లే అవకాశం ఉంది.